National Turmeric Board: పసుపు రైతులకు సంక్రాంతి కానుక..నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు,మాట నిలబెట్టుకున్నామన్న కిషన్‌ రెడ్డి

పసుపు రైతులకు సంక్రాంతి కానుకను అందించింది కేంద్ర ప్రభుత్వం. నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ఎన్నికల్లో చెప్పిన విధంగా ఇవాళ ప్రారంభించనుంది.

National Turmeric Board at Nizamabad(Google Photos)

Nizamabad, January 14:  పసుపు రైతులకు సంక్రాంతి కానుకను అందించింది కేంద్ర ప్రభుత్వం. నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ఎన్నికల్లో చెప్పిన విధంగా ఇవాళ ప్రారంభించనుంది. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ వర్చువల్‌గా ప్రారంభించనుండగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

ఉదయం 11 గంటలకు బోర్డు కార్యాలయాన్ని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్‌ గోయల్‌ ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. అలాగే జాతీయ పసుపు బోర్డు చైర్మన్‌గా పల్లె గంగారెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో ఆయన మూడేళ్ల పాటు కొనసాగనున్నారు.  పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిన కరీంనగర్‌ పోలీసులు, డాక్టర్‌ సంజయ్‌పై పరుష పదజాలం..అదుపులోకి

తెలంగాణ ప్రజల తరఫున ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు కిషన్ రెడ్డి. నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వానిది క్రియాశీలక పాత్ర పోషించిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు కానుండటంతో రైతుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Group-2 Results Today: నేడు గ్రూప్‌-2 ఫలితాలు.. జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుల పరీక్ష ఫలితాలు

Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

Advertisement
Advertisement
Share Now
Advertisement