No Night Shows For Minors: ఉదయం 11 గంటలకు ముందు, రాత్రి 11 గంటల తర్వాత సినిమా థియేటర్లకు మైనర్లను అనుమతించొద్దు.. తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ఉదయం 11 గంటలకు ముందు, రాత్రి 11 గంటల తర్వాత 16 ఏండ్లలోపు పిల్లలను అంటే మైనర్లను సినిమా థియేటర్లకు అనుమతించొద్దని హైకోర్టు అభిప్రాయపడింది. దీనిపై తగిన నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ హోం శాఖకు సూచించింది.

Telangana High Court (photo-File Image)

Hyderabad, Jan 28: ఉదయం 11 గంటలకు ముందు, రాత్రి 11 గంటల తర్వాత 16 ఏండ్లలోపు పిల్లలను అంటే మైనర్లను (Minors) సినిమా థియేటర్లకు (Cinema Halls) అనుమతించొద్దని హైకోర్టు అభిప్రాయపడింది. దీనిపై తగిన నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ హోం శాఖకు సూచించింది. అన్ని వర్గాల ప్రజలతో ప్రభుత్వం చర్చలు జరిపి చట్ట ప్రకారం నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. ‘గేమ్‌ చేంజర్‌’ సినిమా టికెట్‌ ధరల పెంపును, అదనపు షోలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై సోమవారం విచారణ జరిపిన ధర్మాసనం  పైవిధంగా ఉత్తర్వులు జారీచేశారు. విచారణను ఫిబ్రవరి 22కు వాయిదా వేసింది.

నరాల మీద దాడి చేస్తున్న కొత్త వ్యాధి జీబీఎస్, ఒక్కో ఇంజెక్షన్ ధర వేల రూపాయల పైమాటే, గిలియన్ బారే సిండ్రోమ్ లక్షణాలు, చికిత్స గురించి తెలుసుకోండి

ఇవీ వాదనలు

సినిమాటోగ్రఫీ నిబంధనల ప్రకారం ఉదయం 8.40లోపు, తెల్లవారు జామున 1.30 తర్వాత సినిమాలను ప్రదర్శించరాదు. ఈ మేరకు  పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మల్టీప్లెక్స్‌ ల్లో ఆఖరాట అర్ధరాత్రి 1.30 గంటలకు ఉంటుందన్నారు. ఆ సమయంలో సినిమాకొచ్చే మైనర్ల ఆరోగ్యం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. 'పుష్ప 2' తొక్కిసలాట ఘటననూ ఉదహరించారు. ఈ క్రమంలో  పిటిషనర్‌ తరఫు న్యాయవాదితో ఏకీభవించిన ధర్మాసనం పైవ్యాఖ్యలు చేసింది.

మహారాష్ట్రను వణికిస్తున్న కొత్త వ్యాధి, ఇప్పటికే ఒకరు మృతి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 73 మంది

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement