Accident In Hyderabad: హైదరాబాద్ లో టిప్పర్ బీభత్సం.. గచ్చిబౌలి సిగ్నల్ దగ్గర వాహనాలపైకి దూసుకెళ్లిన వాహనం.. ఒకరి మృతి.. మరో ఐదుగురికి గాయాలు

హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో సోమవారం ఓ టిప్పర్ బీభత్సం సృష్టించింది. సిగ్నల్ దగ్గర ఆగిన నాలుగు కార్లు, రెండు బైక్ ల పైకి దూసుకెళ్లింది. స్విగ్గీ డెలివరీ బాయ్ గా పనిచేస్తున్న నసీర్ అనే యువకుడు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి.

Credits: Twitter

Hyderabad, Dec 26: హైదరాబాద్ లోని (Hyderabad) గచ్చిబౌలిలో (Gachibouli) సోమవారం ఓ టిప్పర్ (Tipper) బీభత్సం సృష్టించింది. విప్రో చౌరస్తాలో టిప్పర్ అదుపుతప్పింది. సిగ్నల్ (Signal) దగ్గర ఆగిన నాలుగు కార్లు, రెండు బైక్ ల పైకి దూసుకెళ్లింది. దీంతో వాహనాలన్నీ నుజ్జునుజ్జయ్యాయి. స్విగ్గీ డెలివరీ బాయ్ గా పనిచేస్తున్న నసీర్ అనే యువకుడు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో అబ్దుల్ అనే విద్యార్థికి కాలు విరిగిందని వైద్యులు తెలిపారు.

‘బాంబ్ సైక్లోన్’తో అమెరికాలో దారుణ పరిస్థితులు.. 34కు చేరిన మృతుల సంఖ్య

ప్రమాదం విషయం తెలిసి అక్కడికి చేరుకున్న పోలీసులు టిప్పర్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. బ్రేకులు ఫెయిల్ కావడంతో టిప్పర్ అదుపుతప్పినట్లు పోలీసులు చెబుతున్నారు.

బస్సులో పారేసుకున్న పర్సు యువతి ప్రాణాలు కాపాడింది.. హైదరాబాద్ లో ఘటన

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement