Ex MLA Madan Lal Viral Photos: ఖమ్మం బీఆర్‌ఎస్‌లో రాసలీలల కలకలం, అమ్మాయితో సన్నిహితంగా ఉన్నట్లు మాజీ ఎమ్మెల్యే ఫోటోలు హల్ చల్‌, ఫస్ట్ లిస్ట్ ప్రకటించేముందు బీఆర్ఎస్‌లో హీటెక్కిన గ్రూపు రాజకీయాలు

బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ వ్యక్తిగత ఫోటోలు వైరల్ గా మారాయి. వైరా మాజీ ఎమ్మెల్యే బానుకు మదన్ లాల్ ఓ మహిళతో సన్నిహితంంగా ఉన్న ఫోటోలను ప్రత్యర్థి వర్గం వైరల్ చేస్తోంది.

Ex MLA Madan Lal Viral Photos

Khammam, AUG 20: ఖమ్మం జిల్లా వైరా (Wyra) రాజకీయం రసవత్తరంగా మారింది. బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ వ్యక్తిగత ఫోటోలు వైరల్ గా మారాయి. వైరా మాజీ ఎమ్మెల్యే బానుకు మదన్ లాల్ ఓ మహిళతో సన్నిహితంంగా ఉన్న ఫోటోలను ప్రత్యర్థి వర్గం వైరల్ చేస్తోంది. వైరా బీఆర్ఎస్ టికెట్టు మదన్ లాల్ కే (madanlal) వస్తుందన్న ప్రచారంతో ప్రత్యర్థులు ఆఖరి ప్రయత్నాలు చేస్తున్నారని, మార్ఫింగ్ చేసిన ఫోటోలను వైరల్ (Ex MLA Madan Lal) చేస్తున్నారని మదన్ లాల్ వర్గీయులు అంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల మొదటి లిస్టులు ప్రకటించే నేపథ్యంలో వైరా నియోజకవర్గ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ పేరు ప్రస్తావించిన నేపథ్యంలో ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీలో కాబోయే ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించడంలో రాజకీయం రసవత్తరంగా మారింది.

గతంలో మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ ఓ మహిళతో సన్నిహితంగా ఉన్న ఫొటోలను వైరల్ (viral photos) చేస్తూ ప్రత్యర్థి వర్గాలు ప్రచారం కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో వాట్సప్ గ్రూప్ ల్లో ఫొటోలను పూర్తిగా వైరల్ చేస్తున్న పరిస్థితుల్లో ఈ విషయంపై మదన్ లాల్ వర్గీయులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడో గతంలో జరిగినటువంటి ఈ ఫొటోల వ్యవహారాన్ని ఇప్పుడు ప్రత్యర్థి రాములు నాయక్ కు చెందిన వర్గం బాగా వైరల్ చేస్తోందని మదన్ లాల్ వర్గీయులు ఆరోపణలు చేస్తున్నారు. సోమవారం సీఎం కేసీఆర్ మొదటి లిస్టు ప్రకటించనున్న నేపథ్యంలో ప్రస్తుత ఎమ్మెల్యే రాములు నాయక్ కు టికెట్ రావడం లేదన్న విషయాన్ని తెలుసుకున్న ఆయన వర్గీయులు మదన్ లాల్ కు టికెట్ కన్ఫామ్ అవుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా అధికార బీఆర్ఎస్ పార్టీల నేతల మధ్య వైరుధ్యం మరింత పెరిగిందని చెప్పుకోవచ్చు. ఒకరిపైమరొకరు విమర్శలు చేసుకుంటూనే ఒక మహిళతో మదన్ లాల్ సన్నిహితంగా ఉన్న ఫొటోను వైరల్ చేస్తున్నారు.

ఈ విషయంపై మదన్ లాల్ వర్గీయులు సీరియస్ గా ఉన్నారు. నియోజకవర్గంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేసే అవకాశం ఉందని మదన్ లాల్ వర్గీయులు చెబుతున్నారు. కావాలనే సోషల్ మీడియా వేదికగా ఫొటోలను వైరల్ చేస్తూ తమ నేతను ఇబ్బందుల పాలుచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.



సంబంధిత వార్తలు

Jagan Slams Chandrababu Govt: పలావు పోయిందీ, బిర్యానీ పోయింది, చంద్రబాబు మీద మండిపడిన వైఎస్ జగన్, విజన్‌ 2047 పేరిట మరో డ్రామా జరుగుతుందని వెల్లడి

Komatireddy Rajagopal Reddy: తనపై ఆంధ్రా మీడియా దుష్ప్రచారం, ఎన్టీఆర్‌ ఘాట్ కూల్చాలని అనలేదన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎన్టీఆర్ ఘాట్ జోలికి వస్తే ప్రజలే తిరగబడతారన్న బీఆర్ఎస్

Telangana Assembly Sessions: మంత్రులే ప్రశ్నలు అడుగుతారా?, మూసీని మురికి కూపం చేసిందే కాంగ్రెస్..హరీశ్‌ రావు ఫైర్, అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నాం అన్న మంత్రి ఉత్తమ్

Telangana Assembly Sessions: బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్.. కౌశిక్ రెడ్డిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆగ్రహం..తీరు మార్చుకోకపోతే సస్పెండ్ చేస్తానని వార్నింగ్

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif