Traffic Alert in Hyderabad: నేడు సికింద్రాబాద్ కు ప్రధాని మోదీ.. మధ్యాహ్నం 2 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు.. పూర్తి వివరాలు ఇదిగో!
ప్రధాని మోదీ మరోసారి హైదరాబాద్ కు వస్తున్నారు. శనివారం సాయంత్రం సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్న అణగారిన వర్గాల విశ్వరూప బహిరంగ సభలో పాల్గొంటారు.
Newdelhi, Nov 11: ప్రధాని మోదీ (PM Modi) మరోసారి హైదరాబాద్ కు వస్తున్నారు. శనివారం సాయంత్రం సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో (Parade grounds) నిర్వహిస్తున్న అణగారిన వర్గాల విశ్వరూప బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 గంటల వరకు పరేడ్ గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) విధించారు. టివోలి క్రాస్ రోడ్స్ నుంచి ప్లాజ్ ఎక్స్ రోడ్స్ ను మూసివేయనున్నారు. పలు మార్గాల్లో దారిమళ్లింపులు ఉంటాయని చెప్పారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.
ట్రాఫిక్ మళ్లింపు ఇలా..
- సంగీత్ ఎక్స్ రోడ్స్ నుంచి బేగంపేట వైపు వెళ్లే వాహనాలను వైఎంసీఏ నుంచి క్లాక్ టవర్, ప్యాట్నీ ప్యారడైజ్, సీటీఓ, రసూల్‌పుర నుంచి బేగంపేటకు వెళ్లాలి.
- బేగంపేట నుంచి సంగీత్ ఎక్స్ రోడ్స్ వైపు వెళ్లే వాహనదారులు సీటీఓ ఎక్స్ రోడ్స్ వద్ద బాలమ్ రాయ్, బ్రూక్ బాండ్, తివోలి, స్వీకార్ ఉపకార్, వైఎంసీఏ, సెయింట్ జాన్సన్ రోటరీ మీదుగా వెళ్లాలి.
- బోయిన్‌పల్లి, తాడ్ బన్ నుంచి టివోలి వైపు వెళ్లే వాహనాలను బ్రూక్ బాండ్ వద్ద నుంచి సీటీఓ, రాణిగంజ్ వైపు మళ్లిస్తారు,
- కార్ఖానా, జేబీఎస్ నుంచి ఎస్‌బీఐ ప్యాట్నీ వైపు స్వీకార్ ఉపకార్ నుంచి వైఎంసీఏ, క్లాక్ టవర్ మీదుగా వెళ్లాలి.
- ప్యాట్నీ నుంచి ఎస్‌బీఐ, స్వీకార్ ఉపకార్ వైపు వాహనాలను అనుమతించరు. క్లాక్ టవర్స్ వద్ద నుంచి వైఎంసీఏ వైపు మళ్లిస్తారు.
- తిరుమలగిరి ఆర్టీఏ, కార్ఖానా, మల్కాజిగిరి, సఫిల్‌గూడ నుంచి ఫ్లాజా వైపు వెళ్లే వాహనాలను తివోలి వద్ద నుంచి స్వీకార్ ఉపకార్, వైఎంసీఏ వైపు మళ్లిస్తారు.
Advertisement
సంబంధిత వార్తలు
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
BRSLP Meeting Update: 11న బీఆర్ఎస్ఎల్పీ సమావేశం.. మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన శాసనసభాపక్షం సమావేశం, అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ
PM Modi On Womens Day: నారీ శక్తికి వందనం... మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పెషల్ ట్వీట్, మహిళల సాధికారత కోసం కృషిచేస్తామని వెల్లడి
Traffic Restrictions: హైదరాబాద్‌లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు, సికింద్రాబాద్ వైపు వెళ్లేవారికి ప్రత్యామ్నాయ మార్గాలివే!
Advertisement
Advertisement
Advertisement