Pushpa-2 Stampede Row: సంధ్య థియేటర్‌ తొక్కిసలాట వ్యవహారంలో కీలక పరిణామం, థియేటర్‌కు షోకాజ్ నోటీసులు పంపిన సిటీ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌

సంధ్య థియేటర్‌ తొక్కిసలాట వ్యవహారంలో మలుపులు తిరుగుతోంది. తాజాగా సంధ్య థియేటర్‌కు హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. థియేటర్‌ లైసెన్స్‌ ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని, దీనిపై పది రోజుల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో ఆదేశించారు.

Hyderabad CP CV Anand (Photo-X)

Hyd, Dec 17: సంధ్య థియేటర్‌ తొక్కిసలాట వ్యవహారంలో మలుపులు తిరుగుతోంది. తాజాగా సంధ్య థియేటర్‌కు హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. థియేటర్‌ లైసెన్స్‌ ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని, దీనిపై పది రోజుల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో ఆదేశించారు. తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డ బాలుడు శ్రీతేజ్‌ను కిమ్స్‌ ఆసుపత్రిలో వైద్య ఆరోగ్యశాఖ శాఖ హెల్త్ సెక్రటరీ క్రిస్టినాతో కలిసి సీపీ పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు.

మరోసారి క్షమాపణలు చెప్పిన అల్లు అర్జున్, రేవతి కుటుంబానికి అండగా ఉంటాం..బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ప్రయత్నిస్తున్నానని వెల్లడి

డిసెంబర్‌ 4న పుష్ప-2 మూవీ ప్రీమియర్‌ షో సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రీమియర్‌ షోకు హీరో అల్లు అర్జున్‌ రాగా.. ఆయనను చూసేందుకు అభిమానులు ఎగబడటంతో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందింది. ఆమె తనయుడు శ్రీతేజ్ గాయపడి కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.ఈ వ్యవహారంలో పోలీసులు థియేటర్‌ యాజమాన్యంతో పాటు హీరో అల్లు అర్జున్‌పై కేసు నమోదు చేశారు. బన్నీతో పాటు పలువురిని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్‌కు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Group-2 Results Today: నేడు గ్రూప్‌-2 ఫలితాలు.. జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుల పరీక్ష ఫలితాలు

Kalyan Ram New Movie Title: మరోసారి పోలీస్ డ్రస్‌ వేసిన విజయశాంతి, హిట్‌ మూవీ వైజయంతి రోల్‌లో కల్యాణ్‌రామ్‌కు తల్లిగా వస్తున్న కొత్త సినిమా పోస్టర్ ఇదుగోండి!

Sourav Ganguly Acting Debut: వెండితెరపై సౌరవ్ గంగూలీ... నెట్ ఫ్లిక్స్ ఖాకీ 2లో కీలక పాత్ర, మార్చి 20 నుండి స్ట్రీమింగ్ కానున్న వెబ్ సిరీస్!

SC On BRS MLAs' Case: రోగి చనిపోతే ఆపరేషన్ విజయవంతమా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ

Advertisement
Advertisement
Share Now
Advertisement