Rave Party at Janwada Farmhouse: జన్వాడ ఫామ్‌ హౌస్‌ లో వీఐపీల రేవ్‌ పార్టీ.. భగ్నం చేసిన పోలీసులు.. వీడియో వైరల్

హైదరాబాద్ శివారుల్లోని జన్వాడలో రిజర్వ్ కాలనీలో రాజ్‌ పాకాల ఫామ్‌ హౌస్‌ లో రేవ్‌ పార్టీ జరిగింది. విషయం తెలుసుకొన్న సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులు దాన్ని భగ్నం చేశారు.

Rave Party at Janwada Farmhouse (Credits: X)

Hyderabad, Oct 27: హైదరాబాద్ (Hyderabad) శివారుల్లోని జన్వాడలో రిజర్వ్ కాలనీలో (Rave Party at Janwada Farmhouse) రాజ్‌ పాకాల ఫామ్‌ హౌస్‌ లో రేవ్‌ పార్టీ జరిగింది. విషయం తెలుసుకొన్న  సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులు దాన్ని భగ్నం చేశారు. వీఐపీల రేవ్‌ పార్టీలో డ్రగ్స్‌ తీసుకున్నట్టు తేలడంతో కేసు నమోదు చేసినట్టు తెలిపారు. అలాగే, ఫారిన్‌ లిక్కర్‌, డ్రగ్స్‌ ను పోలీసులు సీజ్‌ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జన్వాడలోని రిజర్వ్ కాలనీలో రాజ్‌ పాకాల ఫామ్‌ హౌస్‌ లో వీఐపీల రేవ్‌ పార్టీ జరిగింది. డీజే సౌండ్స్‌ తో బీభత్సం సృష్టించడంతో స్థానికులు పోలీసులు సమాచారం ఇచ్చారు. దీంతో  రంగంలోకి దిగిన సైబరాబాద్‌ ఎస్‌ఓటీ పోలీసులు రేవ్‌ పార్టీని భగ్నం చేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. రేవ్‌ పార్టీలో విదేశీ మద్యం, డ్రగ్స్‌ ఉన్నట్టు గుర్తించారు.

తమిళ హీరో విజయ్ టీవీకే మహానాడు..విళుపురం జిల్లాలో భారీగా ఏర్పాట్లు, తొలిసారి తమిళ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతుండగా అందరి దృష్టి విజయ్‌పైనే

Here's Video: 

డ్రగ్స్ తీసుకున్నారు

పార్టీలో 42 మంది పాల్గొన్నట్టు తెలుస్తోంది. డ్రగ్స్‌ పరీక్షలు నిర్వహించగా పలువురు కొకైన్‌ తీసుకున్నట్టు తేలింది. మరో ఇద్దరికి కూడా డ్రగ్స్‌ పాజిటివ్‌ గా తేలినట్టు సమాచారం. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తెలంగాణ కేబినెట్ కీల‌క నిర్ణ‌యాలు, వ‌రంగ‌ల్, హ‌న్మ‌కొండ జిల్లాల ప‌రిధి పెంపు, ధ‌ర‌ణి స్థానంలో భూమాత స‌హా అనేక అంశాల‌కు ప‌చ్చ‌జెండా 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement