cm revanth cabinet

Hyderabad, OCT 26: తెలంగాణ క్యాబినెట్ భేటీలో (Telangana Cabinet Meet) కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హన్మకొండ, వరంగల్ జిల్లాల పరిధిని పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అలాగే ఏటూరు నాగారం రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు నిర్ణయించారు. మున్సిపాలిటీగా మద్దూర్ మండల కేంద్రాన్ని అప్ గ్రేడ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది క్యాబినెట్. సన్న బియ్యానికి రూ.500 బోనస్ నిర్ణయానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ (Cabinet Decisions) ఇచ్చింది. రేరాలో 54 ఉద్యోగాల భర్తీకి టీజీపీఎస్సీకి ఆదేశాలు ఇస్తూ క్యాబినెట్ నిర్ణయించింది. ఉస్మానియా హాస్పిటల్ నిర్మాణానికి, గోశామహల్ పోలీస్ గ్రౌండ్స్ భూమి బదలాయింపునకు మంత్రివర్గం ఓకే చెప్పింది. అలాగే ములుగులో గిరిజన యూనివర్సిటీకి భూమిని కేటాయించారు. పవర్ కార్పొరేషన్ దగ్గర 7వేల కోట్ల రూపాయల అప్పు కోసం క్యాబినెట్ అనుమతిపై చర్చ జరిగింది.

Telangana DGP: పోలీస్ కానిస్టేబుళ్ల ఆందోళనలపై స్పందించిన తెలంగాణ డీజీపీ, క్రమశిక్షణ గల ఫోర్స్‌లో ఉండి ఆందోళనలు చేయడం సరికాదన్న జితేందర్ 

రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని రోడ్లు తనఖా పెట్టడంపై క్యాబినెట్ లో డిస్కస్ చేశారు. కేంద్ర సంస్థల దగ్గర రుణాలు తీసుకోవడంపై క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. సినిమా స్టూడియో నిర్మాణం కోసం భూమి కేటాయింపుపై క్యాబినెట్ లో చర్చించారు.

Madhu Yashki: ఆస్తులు కాపాడుకోవడానికే పార్టీ మారుతున్నారు, కాంగ్రెస్ పార్టీపై ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ప్రేమ లేదన్న మధుయాష్కి గౌడ్..కాంగ్రెస్ నాయకుల హత్య బాధాకరం అని మండిపాటు 

పరిపాలనపరంగా చాలా కీలకమైన నిర్ణయాలకు క్యాబినెట్ వేదిక కాబోతోందని సమాచారం. పరిపాలనకు సంబంధించిన అంశాలను చూసుకుంటే.. కీలక నిర్ణయం వెలువడనుందని సమాచారం. కొత్త రెవెన్యూ చట్టానికి క్యాబినెట్ ఆమోదం తెలపబోతోందని సమాచారం. ధరణి స్థానంలో భూమాత పోర్టల్ కు మంత్రివర్గం ఆమోదం తెలపబోతోంది. మూసీ నిర్వాసితుల అంశంపైన కూడా క్యాబినెట్ లో చర్చ జరుగుతోంది. దీనిపై ప్రభుత్వం ఎలా ముందుకెళ్లాలి? ప్రతిపక్షాన్ని ఎలా కట్టడి చేయాలి? అనేదానిపై కేబినెట్ ఒక కీలక నిర్ణయం తీసుకోబోతోందని తెలుస్తోంది.