Telangana New Ration Cards: తెలంగాణవాసులకు గుడ్ న్యూస్.. కొత్త రేషన్ కార్డుల జారీపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్‌

కొత్త రేషన్ కార్డుల కోసం ఏండ్లుగా ఎదురుచూస్తున్న తెలంగాణవాసులకు గుడ్ న్యూస్. కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డులను వేర్వేరుగా జారీ చేయడానికి, అర్హులు ఎంపికకు అవసరమైన సిఫార్సులు చేసేందుకు కేబినెట్ సబ్ కమిటీని రేవంత్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

Uttam Kumar Reddy (photo-Video Grab)

Hyderabad, Aug 9: కొత్త రేషన్ కార్డుల (Telangana New Ration Cards) కోసం ఏండ్లుగా ఎదురుచూస్తున్న తెలంగాణవాసులకు గుడ్ న్యూస్. కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డులను (Health Cards) వేర్వేరుగా జారీ చేయడానికి, అర్హులు ఎంపికకు అవసరమైన సిఫార్సులు చేసేందుకు కేబినెట్ సబ్ కమిటీని రేవంత్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సబ్ కమిటీ రేషన్ కార్డులు, హెల్త్ కార్డు లబ్దిదారుల ఎంపికపై అధ్యయనం చేసి అవసరమైన విధివిధానాలను ప్రభుత్వానికి సిఫార్సు చేయనుంది.

పారిస్ ఒలింపిక్స్‌ లో మెరిసిన నీరజ్ చోప్రా.. రజతాన్ని ముద్దాడిన బల్లెం వీరుడు.. వరుసగా రెండవ ఒలింపిక్స్‌ లోనూ పతకాన్ని సాధించిన ధీరుడు.. ప్రధాని మోదీ ప్రశంసలు

వేర్వేరు కార్డులు ఎందుకు?

ప్రస్తుతం రేషన్ కార్డు లబ్దిదారులకే ఉచిత ఆరోగ్య వైద్య సేవలు (ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డు) అందుబాటులో ఉన్నాయి. అయితే ఉచిత వైద్య సేవల కోసం అనర్హులు కూడా రేషన్ కార్డులు పొందుతున్నారని నివేదికలు చెప్తున్నాయి. దీన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం రేషన్ కార్డు, హెల్త్ కార్డు లింక్‌ ను తొలగించి వేర్వేరుగా కార్డులు మంజూరు చేయాలని నిర్ణయించింది.

‘బ్రేక్’ థీమ్ తో వినూత్నంగా నేటి గూగుల్ డూడుల్.. దీని అర్థం తెలుసా?

కమిటీలో వీళ్లే..

పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సబ్‌ కమిటీకి చైర్మన్‌ గా వ్యవహరించనున్నారు. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలను సభ్యులుగా ఉంటారు.

భారత్ ఖాతాలో మరో పతకం, కాంస్య పోరులో స్పెయిన్‌ పై భారత హాకీ జట్టు విజయం, 2-1 తేడాతో గెలిచి కాంస్యం సొంతం

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Group-2 Results Today: నేడు గ్రూప్‌-2 ఫలితాలు.. జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుల పరీక్ష ఫలితాలు

Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

Advertisement
Advertisement
Share Now
Advertisement