CM Revanth Reddy: టీటీడీ బోర్డు తరహాలోనే యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు, సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు, అవసరమైతే చట్ట సవరణ చేస్తామని వెల్లడి

స్పీడ్ ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా 19 ప్రాజెక్టులపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ప్రధానంగా టూరిజం అభివృద్ధికి కొత్త పాలసీ తీసుకురావాలన్న సీఎం రేవంత్...ఇతర రాష్ట్రాల్లో ఉన్న పాలసీలపై అధ్యయనం చేయాలన్నారు. హెల్త్, ఎకో, టెంపుల్ టూరిజంపై దృష్టి పెట్టాలని చెప్పిన రేవంత్..తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

Telangana CM Revanth Reddy on Yadagiri Gutta Temple Board(CMO)

Hyd, Aug 31:  స్పీడ్ ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా 19 ప్రాజెక్టులపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ప్రధానంగా టూరిజం అభివృద్ధికి కొత్త పాలసీ తీసుకురావాలన్న సీఎం రేవంత్...ఇతర రాష్ట్రాల్లో ఉన్న పాలసీలపై అధ్యయనం చేయాలన్నారు. హెల్త్, ఎకో, టెంపుల్ టూరిజంపై దృష్టి పెట్టాలని చెప్పిన రేవంత్..తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

టీటీడీ అనుసరించిన తరహాలోనే కొత్తగా ఏర్పాటు చేయబోయే బోర్డుకు స్వయం ప్రతిపత్తి, విధి విధానాలు ఉండేలా అవసరమైతే చట్ట సవరణ చేయాలని ఆదేశించారు. యాదగిరిగుట్ట ఆలయ రాజ గోపురానికి బంగారు తాపడం పనులను ప్రారంభించాలని ఆదేశించారు. స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ ప్రాజెక్టుల్లో భాగంగా దేవాలయాల అభివృద్ధిపై డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రి ఉన్నతాధికారుల సమావేశంలో సమీక్షించారు.

యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి పనులు చాలావరకు అర్థంతరంగా నిలిచిపోయిన విషయాన్ని ప్రస్తావిస్తూ అలా ఆగిపోవడానికి వీల్లేదని, ఇప్పటివరకు ఏమేం అభివృద్ధి పనులు జరిగాయి. ఇంకా ఏమేం అసంపూర్తిగా ఉన్నాయనే వివరాలతో వారం రోజుల్లో సమగ్ర నివేదికను అందించాలని ఆదేశించారు.  హైడ్రా దౌర్జన్యకాండపై కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు ఫైర్, కూల్చివేతలు అక్రమం , తనలాంటి వాల్లకే ఇలాంటి పరిస్థితి ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటని మండిపాటు!

Here's Tweet:

ప్రస్తుతం కీసర గుట్టపై ఉన్న రామలింగేశ్వర ఆలయాన్ని అద్భుతంగా పునర్నిర్మించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ములుగు జిల్లాలోని రామప్ప ఆలయానికి ప్రతిరూపంగా, అచ్చం అదే నమూనాతో కీసరగుట్ట ఆలయాన్ని నిర్మించాలని చెప్పారు. ఇప్పుడున్న అధునాతన టెక్నాలజీతో రామప్ప ఆలయ ఆకృతిలో యథాతథంగా కీసర ఆలయం పునర్మిర్మాణం చేపట్టాలని సూచించారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement