Telangana Shocker: వీడియో ఇదిగో, ఇన్‌స్టాలో పరిచయమైన విద్యార్థిని హోటల్ రూములో బంధించి 20 రోజులుగా అఘాయిత్యం, రక్షించిన షీ టీమ్
ఓ విద్యార్థిని హోటల్ గదిలో నిర్బంధించిన ఇన్‌స్టాగ్రామ్ ఫ్రెండ్ 20 రోజులపాటు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న ‘షీ టీం‘ పోలీసులు బాధితురాలిని రక్షించారు.
హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ విద్యార్థిని హోటల్ గదిలో నిర్బంధించిన ఇన్‌స్టాగ్రామ్ ఫ్రెండ్ 20 రోజులపాటు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న ‘షీ టీం‘ పోలీసులు బాధితురాలిని రక్షించారు. పోలీసుల కథనం ప్రకారం.. నిర్మల్ జిల్లాలోని భైంసాకు చెందిన బాధిత విద్యార్థికి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువకుడు బెదిరించి హైదరాబాద్ పిలిపించుకున్నాడు.
అక్కడికెళ్లాక నారాయణగూడలోని ఓ హోటల్ రూముకు తీసుకెళ్లి అందులో నిర్బంధించాడు. 20 రోజుల పాటు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయాన్ని ఆమె తన తల్లిదండ్రుకు ఫోన్ చేసి చెప్పింది. దీంతో కంగారుపడిన వారు వెంటనే హైదరాబాద్ చేరుకుని షీ టీమ్స్‌ను ఆశ్రయించారు. బాధితురాలు వాట్సాప్ ద్వారా తల్లిదండ్రులకు లొకేషన్ షేర్ చేయడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. నారాయణగూడలోని ఓ హోటల్‌లో బాధిత విద్యార్థిని ఉన్నట్టు గుర్తించి రక్షించారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దారుణం, ఆవుపై అర్థరాత్రి అత్యాచారానికి పాల్పడిన లాయర్, షార్ట్ జిప్పు తీసి గోమాత వెనుక నిలబడి అమానుషం
Here's Video