Diwali Holiday 2022: తెలంగాణలో ఈ నెల 24న దీపావళి సెలవు, కీలక ప్రకటన చేసిన తెలంగాణ ప్రభుత్వం, 25వ తేదీ నుంచి 24వ తేదీకి మార్చినట్టు ఉత్తర్వుల్లో వెల్లడి

దీపావళి పండుగ సెలవుపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటక చేసింది. ఈ నెల 24వతేదీన(సోమవారం) సెలవు దినంగా (Diwali holiday on October 24) ప్రకటించింది. కాగా, సెలవును 25వ తేదీ నుంచి 24వ తేదీకి మార్చినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.

Telangana Govt Logo

దీపావళి పండుగ సెలవుపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటక చేసింది. ఈ నెల 24వతేదీన(సోమవారం) సెలవు దినంగా (Diwali holiday on October 24) ప్రకటించింది. కాగా, సెలవును 25వ తేదీ నుంచి 24వ తేదీకి మార్చినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నెల 25న (మంగళవారం) అమావాస్య అని క్యాలెండర్లలో ఉంది. దీపావళిని ఆశ్వయుజ మాసం బహుళ అమావాస్య రోజున జరుపుకుంటారు.

దీపావళిని ప్రదోష వేళ (సూర్యాస్తమయ సమయంలో) నిర్వహిస్తారు. ఈ నెల 25నే అమావాస్య తిథి ఉన్నప్పటికీ ప్రదోష వేళ వచ్చేసరికి పాడ్యమి ఘడియలు వచ్చాయని పండితులు అంటున్నారు. 25న సాయంత్రం 4.25 గంటల లోపు అమావాస్య ముగిసి పాడ్యమి వచ్చేస్తుందని చెబుతున్నారు. దీంతో సూర్యాస్తమయానికి అమావాస్య ఉండడం లేదని, 24న సాయంత్రం 4.25 గంటల సమయానికి అమావాస్య ప్రారంభమవుతోందని వివరించారు.

తెలంగాణలో సెక్స్ నేరస్థుల రిజిస్టర్‌, సామాజిక కార్యకర్త సునీతా కృష్ణన్ ప్రతిపాదనకు ఓకే చెప్పిన మంత్రి కేటీఆర్

పండితులు సైతం దీపావళిని 24నే జరుపుకోవాలని అంటుండడంతో ఆ రోజునే ప్రభుత్వం సెలవు ప్రకటించింది. 24నే ధనలక్ష్మి పూజలు నిర్వహించాలని పండితులు చెబుతున్నారు. దీపావళి రోజున కేదారేశ్వర వ్రతాన్ని చాలా మంది జరుపుకుంటారు. 24న మధ్యాహ్నం అమావాస్య తిథి లేకపోవడంతో మరుసటి రోజు వ్రతం జరుపుకోవాల్సి ఉండగా, కానీ 25న సూర్యగ్రహణం ఉండడంతో అందుకు వీలు ఉండదు. గ్రహణం విడిచిన అనంతరం సాయంత్రం వేళ జరుపుకోవాలని కొందరు చెప్పారు. అయితే, పండుగ రోజే ఆ వ్రతాన్ని ఆచరించే పద్ధతి ఉండడంతో 24నే వ్రతం చేసుకోవాలని కొందరు పండితులు చెబుతున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement