Telangana Horror: తాగుబోతు భర్త దారుణం, భార్య నిద్రపోతుండగా కరెంట్ పెట్టి చంపిన కిరాతకుడు, మందు మానేయమని చెప్పడమే కారణం

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో దారుణం జరిగింది. మద్యం తాగొద్దన్నందుకు కోపంతో నిద్రలో ఉన్న భార్యకు కరెంట్‌ షాక్‌ పెట్టాడు ఓ తాగుబోతు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

Image used for representational purpose | (Photo Credits: PTI)

Hyd, May 17: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో దారుణం జరిగింది. మద్యం తాగొద్దన్నందుకు కోపంతో నిద్రలో ఉన్న భార్యకు కరెంట్‌ షాక్‌ పెట్టాడు ఓ తాగుబోతు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.దారుణ ఘటన వివరాల్లోకెళితే.. పదేళ్ల కిందట.. కవిత, యాదయ్యలు ప్రేమవివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే.. యాదయ్య మద్యానికి బానిస అయ్యాడు.

ఈ క్రమంలో ఆ అలవాటు మానుకోవాలని ఆమె కోరింది. పంచాయితీలు జరగ్గా.. పెద్దలు ఆమెకు సర్దిచెప్పి పంపించారు. ఈ క్రమంలో ఆమెపై కోపం పెంచుకుని కిరాతకంగా చంపాడు. అనంతరం మత్తు దిగడంతో.. భయంతో పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి కరెంట్‌ షాక్‌తో చనిపోయిందని అబద్ధపు ఫిర్యాదు చేశాడు.

కల్తీమద్యం తాగి 12 మంది మృతి.. డజనుకు పైగా దవాఖానపాలు.. తమిళనాడులో ఘోరం

అయితే పోలీసులు అనుమానంతో తమదైన శైలిలో ప్రశ్నించగా.. నిజం ఒప్పుకున్నాడు. ఈ ఘటనపై కొండుర్గు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. తమ బిడ్డను అన్యాయంగా బలిగొన్నాడంటూ కవిత కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement