Telangana Horror: వివాహేతర సంబంధం గొడవ, భార్య తలను నరికి అనుమానిత ప్రియుడి ఇంటి గుమ్మానికి వేలాడదీసిన భర్త, పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయిన నిందితుడు
అంతటితో ఆగకుండా శరీరం నుంచి తలను వేరు చేసి.. వివాహేతర సంబంధం కలిగి ఉన్న వ్యక్తి ఇంటి గుమ్మం ఎదుట పడేశాడు. ఈ దారుణ ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం అనంతసాగర్‌లో బుధవారం రాత్రి చోటుచేసుకుంది.
Hyderabad, October 15: వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని భార్యను అతి కిరాతకంగా (Telangana Horror) నరికి చంపాడో భర్త. అంతటితో ఆగకుండా శరీరం నుంచి తలను వేరు చేసి.. వివాహేతర సంబంధం కలిగి ఉన్న వ్యక్తి ఇంటి గుమ్మం ఎదుట పడేశాడు. ఈ దారుణ ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం అనంతసాగర్‌లో బుధవారం రాత్రి చోటుచేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. నారాయణఖేడ్ (Narayankhed) మండలం అనంతసాగర్‌కు చెందిన సాయిలు, అనసూయ(42) దంపతులు. సాయిలు హైదరాబాద్‌లో జ్యూస్ సెంటర్ నిర్వహిస్తూ కుటుంబంతో సహా అక్కడే నివసిస్తున్నాడు. లాక్‌డౌన్ సమయంలో కుటుంబంతో సహా తిరిగి స్వగ్రామానికి వచ్చాడు. అయితే అనసూయకు నారాయణఖేడ్‌కు చెందిన మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లు భర్త అనుమానిస్తున్నాడు. వివాహేతర సంబంధం విషయమై భార్యాభర్తలు తరచూ గొడవ పడేవారు. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది.
ఈ క్రమంలో సాయిలు బుధవారం రాత్రి తన భార్యను గొడ్డలితో (Man Beheads Wife With Axe in Fit of Rage) నరికిచంపాడు. అనసూయ తలను వేరు చేసి ఆమె ప్రియుడిగా భావిస్తున్న నారాయణఖేడ్ సాయిబాబా కాలనీలోని అతని ఇంటి గుమ్మం వద్ద (Places Head at Doorstep) ఉంచాడు. గురువారం ఉదయం అనంతసాగర్‌లోని ఓ ఖాళీ ప్రదేశంలో మహిళ మొండెం పడి ఉండటాన్ని, నారాయణఖేడ్‌లో తల ఉండటాన్ని గుర్తించిన పోలీసులు అనంతసాగర్ గ్రామానికి వెళ్లి విచారణ జరిపారు.
అక్కడి నుంచి నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. కేసు దర్యాప్తులో ఉందని డీఎస్పీ సత్యనారాయణరాజు తెలిపారు. ఘటనా స్థలాన్ని సందర్శించిన స్థానికి డీఎస్పీ సత్యనారాయణ రాజు, సీఐ రవీందర్ రెడ్డి, ఎస్సై సందీప్ తలను ఉంచిన ఇంటివద్ద గ్రామంలో విచారణ జరిపారు. మృతురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.