Telangana Ministers List 2023: తెలంగాణ హోం శాఖా మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా సీతక్క, మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవిగో..

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. అశేష అభిమానుల మధ్య, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల నడుమ పండుగలాంటి వాతావరణంలో సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆయనతోపాటు మరో 11 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.

Uttam Kumar Reddy (photo-Video Grab)

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. అశేష అభిమానుల మధ్య, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల నడుమ పండుగలాంటి వాతావరణంలో సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆయనతోపాటు మరో 11 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.అనంతరం ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి సచివాలయానికి వెళ్లారు. ఆ తర్వాత మంత్రులకు శాఖలను కేటాయించారు.

తెలంగాణకు తొలి దళిత డిప్యూటీ సీఎం, తొలిసారిగా ఇద్దరు మహిళలకు మంత్రి వర్గంలో చోటు, సీఎం రేవంత్ రెడ్డి టీం బయోడేటా ఇదిగో..

సీఎం రేవంత్‌రెడ్డికి ముఖ్య కార్యదర్శిగా శేషాద్రిని నియమించారు. అదే విధంగా ఇంటెలిజెన్స్‌ ఐజీగా శివధర్‌రెడ్డిని నియమించినట్లుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

తెలంగాణ మంత్రులు.. వారి శాఖలు ఇవే:

మల్లు భట్టి విక్రమార్క - డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ

ఉత్తమ్ కుమార్ రెడ్డి - హోం

శ్రీధర్ బాబు - ఆర్థిక శాఖ

తుమ్మల నాగేశ్వరరావు - రోడ్లు, భవనాల శాఖ

జూపల్లి కృష్ణారావు - పౌర సరఫరాల శాఖ

దామోదర రాజనర్సింహ - ఆరోగ్య శాఖ

పొన్నం ప్రభాకర్ - బీసీ సంక్షేమ శాఖ

సీతక్క - గిరిజన సంక్షేమ శాఖ

కొండా సురేఖ - స్త్రీ, శిశు సంక్షేమ శాఖ

కోమటిరెడ్డి వెంకటరెడ్డి - పురపాలక శాఖ

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి - నీటిపారుదల శాఖ.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement