CM Revanth Reddy On New Ration Cards: జనవరి 26 నుండి కొత్త రేషన్ కార్డులు..రైతు భరోసా, ఆదాయాన్ని పెంచి పేదలకు పంచుతామన్న సీఎం రేవంత్ రెడ్డి..ఆ భూములకు రైతు భరోసా వర్తించదు

ప్రభుత్వానికి ఉన్న ఆదాయ వనరులు, ప్రభుత్వ ఆదాయం పెంచడం, పేదలకు పంచడం ప్రభుత్వ విధానం. ఎంత వెసులుబాటు ఉంటే అంత వెసులుబాటు మేరకు రైతులకు మేలు చేయాలన్నదే ప్రభుత్వ ఆలోచన అన్నారు

Telangana new ration cards from January 26 says CM Revanth Reddy(CMO X)

Hyd, January 5:  ప్రభుత్వానికి ఉన్న ఆదాయ వనరులు, ప్రభుత్వ ఆదాయం పెంచడం, పేదలకు పంచడం ప్రభుత్వ విధానం. ఎంత వెసులుబాటు ఉంటే అంత వెసులుబాటు మేరకు రైతులకు మేలు చేయాలన్నదే ప్రభుత్వ ఆలోచన అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం జరుగగా అనంతరం వివరాలను వెల్లడించారు.

రాష్ట్రంలో వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ ఎకరాకు 12 వేల చొప్పున రైతు భరోసా చెల్లించాలని నిర్ణయించినట్టు చెప్పారు. అలాగే వ్యవసాయ భూములు లేని రైతులకు సంవత్సరానికి 12 వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేయాలని, దానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంగా నామకరణం చేసినట్టు చెప్పారు.

రేషన్ కార్డు లేని వారికి కొత్తగా రేషన్ కార్డులు జారీ చేయడం వంటి కీలకమైన మూడు అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఈ మూడూ జనవరి 26 నుంచి అమలులోకి వస్తాయని చెప్పారు. వ్యవసాయం దండగ కాదు. పండుగ చేయాలని తమ ప్రభుత్వం పట్టుదలతో ఉందన్నారు. రైతు భరోసా విషయంలో రైతాంగంలో రకరకాలుగా గందరగోళం సృష్టిస్తున్నారు. ఆ గందరగోళాన్ని దూరం చేస్తూ రైతులకు శుభవార్త చెప్పాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పర్రె మేడిగడ్డకు పడలే.. రేవంత్ పుర్రెకు పడ్డది..చిల్లర రాతలు రాయించేవారిని వదిలిపెట్టం, దేశంలో కేసీఆర్ చక్రం తిప్పే రోజు వస్తుందన్న కేటీఆర్ 

భూమి ఉన్న రైతులకు రైతు భరోసా పథకం కింద సహాయం అందించడమే కాకుండా తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఉన్న భూమి లేని వ్యవసాయ రైతు కుటుంబాలకు ప్రతి ఏటా 12 వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ పథకానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అని నామకరణం చేశాం అన్నారు.

వ్యవసాయానికి యోగ్యం కాని భూములు, అంటే రాళ్లు, రప్పలు, గుట్టలు, రోడ్ల నిర్మాణంలో కోల్పోయిన భూములు, మైనింగ్ చేస్తున్న భూములు, నాలా కన్వర్షన్ అయిన భూములు, రియల్ ఎస్టేట్ వెంచర్లు చేసిన భూములు, పరిశ్రమలకు తీసుకున్న భూములు, రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన భూములకు రైతు భరోసా వర్తించదు అని స్పష్టం చేశారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Group-2 Results Today: నేడు గ్రూప్‌-2 ఫలితాలు.. జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుల పరీక్ష ఫలితాలు

Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

Advertisement
Advertisement
Share Now
Advertisement