COVID19 in TS: తెలంగాణలో కొత్తగా మరో 224 మందికి పాజిటివ్, రాష్ట్రంలో 4518గా ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య, వ్యాక్సిన్ పంపిణీకి విస్తృత ఏర్పాట్లు

జనవరి 16 నుంచి దేశవ్యాప్తంగా కరోనా నివారణకు టీకా పంపిణీ జరుగుతుందని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణ ఆరోగ్యశాఖ విస్తృత ఏర్పాట్లు చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా తొలి రోజు 139 టీకా కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది, మొదటి రోజున సుమారు 13,900 మంది టీకా అందుకోనున్నారు....

Coronavirus in TS (Photo Credits: IANS)

Hyderabad, January 11: జనవరి 16 నుంచి దేశవ్యాప్తంగా కరోనా నివారణకు టీకా పంపిణీ జరుగుతుందని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణ ఆరోగ్యశాఖ విస్తృత ఏర్పాట్లు చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా తొలి రోజు 139 టీకా కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది, మొదటి రోజున సుమారు 13,900 మంది టీకా అందుకోనున్నారు. తొలి ప్రాధాన్యం ఆరోగ్య శాఖ సిబ్బందికి ఇస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 2.90 లక్షల మంది టీకా కోసం రిజిస్టర్ చేసుకున్నట్లు సమాచారం.

ఇక రాష్ట్రంలోని కేసుల విషయానికి వస్తే,  నిన్న రాత్రి 8 గంటల వరకు 24,785 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 224 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 450 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 72,78,021 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.

తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 290,008కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్వల్పంగా 56 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, అన్ని జిల్లాల్లోనూ కేసులు గణనీయంగా తగ్గాయి.రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.

Telangana's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in Telangana

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 28 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Status of positive cases of #COVID19 in Telangana

మరోవైపు గత 24 గంటల్లో మరో 1 కొవిడ్ మరణం సంభవించింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,566కు పెరిగింది. అలాగే, ఆదివారం సాయంత్రం వరకు మరో 461 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో283,924 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,518 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement