COVID in TS: తెలంగాణలో కొత్తగా మరో 1986 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 62 వేలు దాటిన కొవిడ్ బాధితుల సంఖ్య, 519కి పెరిగిన కరోనా మరణాలు

తెలంగాణలో రాష్ట్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం గత 24 గంటల్లో 21,380 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 1986 మందికి పాజిటివ్ అని తేలింది, అయితే ఇంకా 1216 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు....

COVID-19 Outbreak in Telangana | Photo: IANS

Hyderabad, July 31: తెలంగాణలో రాష్ట్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం గత 24 గంటల్లో 21,380 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 1986 మందికి పాజిటివ్ అని తేలింది, అయితే ఇంకా 1216 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 4,37,582 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.

తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 62,703కి చేరుకుంది.  గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గతంలో కంటే ఇప్పుడు కరోనా తీవ్రత ఓ మోస్తరుగా కొనసాగుతుండగా, గ్రేటర్ వెలుపల మాత్రం వైరస్ వ్యాప్తి క్రమంగా పెరుగుతూ పోతుంది.

నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 586 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా,  మేడ్చల్ నుంచి 207 , రంగారెడ్డి జిల్లా నుంచి 205, మరియు సంగారెడ్డి జిల్లాల నుంచి 108 పాజిటివ్ కేసుల చొప్పున నిర్ధారించబడ్డాయి.

ఇక పలు జిల్లాల్లో కొవిడ్ తీవ్రత కొనసాగుతోంది.  వరంగల్ అర్బన్ జిల్లా నుంచి 123 పాజిటివ్ కేసులు నమోదు కాగా,  కరీంనగర్  జిల్లా నుంచి  116 కేసులు వచ్చాయి.

Status of positive cases of #COVID19 in Telangana

జూలై 27న రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Status of positive cases of #COVID19 in Telangana

మరోవైపు గత 24 గంటల్లో మరో 14 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 419 కు పెరిగింది.

అలాగే, గురువారం సాయంత్రం వరకు మరో 816 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 45,388 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 16,796 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement