COVID in TS: తెలంగాణలో కొత్తగా మరో 417 మందికి పాజిటివ్, రాష్ట్రంలో 4982కు చేరిన ఆక్టివ్ కేసుల సంఖ్య, మరో వారం రోజుల్లో వ్యాక్సిన్ పంపిణీకి ఆరోగ్యశాఖ సిద్ధం
దేశంలో భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ మరియు సీరమ్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్లకు భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నెల 13లోగా దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి....
Hyderabad, January 6: తెలంగాణలో ప్రతిరోజు నమోదయ్యే కేసుల్లో హెచ్చుతగ్గులుంటున్నాయి, నిన్నటి వరకు రెండు వందల్లో నమోదైన కొత్త కేసులు నేడు రెట్టింపయ్యాయి. నిన్న రాత్రి 8 గంటల వరకు 43,318 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 417 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 471 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 71,04,367 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 2,88,410కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 82 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, రంగారెడ్డి నుంచి 32 కేసులు వచ్చాయి, ఇక మిగతా అన్ని జిల్లాల నుంచి 20 లోపే కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.