Telangana Shocker: ప్రియురాలిని 18 సార్లు కత్తితో పొడిచిన ప్రియుడు, తనని పెళ్లి చేసుకోకుండా వేరొకరిని పెళ్లి చేసుకోవడమే కారణం, తెలంగాణలో దారుణ ఘటన

తెలంగాణ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలో వికారాబాద్ జిల్లాలో ప్రేమించిన యువతి తనను కాదని మరొకరితో పెండ్లికి సిద్ధమైందన్న కక్షతో ఓ యువకుడు ఆమెపై కత్తితో విచక్షణ రహితంగా దాడిచేశాడు. 18 సార్లు కత్తితో శరీరంపై పొడవటంతో (r stabbed 18 times by jilted lover ) తీవ్రంగా గాయపడి మృత్యువుతో పోరాడుతున్నది.

Image used for representational purpose only. | (Photo Credits: Pixabay)

Hyd, Nov 11: తెలంగాణ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలో వికారాబాద్ జిల్లాలో ప్రేమించిన యువతి తనను కాదని మరొకరితో పెండ్లికి సిద్ధమైందన్న కక్షతో ఓ యువకుడు ఆమెపై కత్తితో విచక్షణ రహితంగా దాడిచేశాడు. 18 సార్లు కత్తితో శరీరంపై పొడవటంతో (r stabbed 18 times by jilted lover ) తీవ్రంగా గాయపడి మృత్యువుతో పోరాడుతున్నది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్‌ జిల్లా దౌల్తాబాద్‌ మండలం తిమ్మారెడ్డిపల్లికి చెందిన బస్వరాజ్‌ హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. అదే మండలానికి చెందిన ఓ యువతి, బస్వరాజ్‌ కొంత కాలం ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ వ్యవహారం తెలిసిన యువతి కుటుంబసభ్యులు 3 నెలల క్రితం మరో యువకుడితో నిశ్చితార్థం జరిపించారు. నిశ్చితార్థం ఫొటోలను చూసిన బస్వరాజ్‌.. తనను పెండ్లి చేసుకోవాలని ఆమెపై ఒత్తిడి చేశాడు. వేధింపులు భరించలేక అతని ఫోన్‌ నంబర్‌ను బ్లాక్‌ చేసింది. అనంతరం ఆమె ఎల్బీనగర్‌లోని బంధువుల ఇంట్లో ఉంటుంది. కక్ష పెంచుకున్న బస్వరాజ్‌.. ఎలాగైనా సదరు యువతిని చంపాలనుకున్నాడు.

పెళ్లికి ఒప్పుకోలేదని లవర్  గొంతు కోసి చంపేసిన ప్రేమోన్మాది, పెద్దపల్లి జిల్లాలో దారుణ ఘటన, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న గోదావరిఖని పోలీసులు

బుధవారం మధ్యాహ్నం బస్వరాజ్‌ ఎల్బీనగర్‌లో యువతి ఉంటున్న ఇంటికి వచ్చాడు. తలుపులు తెరవగానే వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై 18 సార్లు విచక్షణారహితంగా పొడిచాడు. బాధితురాలి కేకలతో పైఅంతస్తులోని వ్యక్తులు ఫోన్‌ ద్వారా బం ధువులకు సమాచారమిచ్చారు. రక్తపు మడుగులో పడి ఉన్న యువతిని వెంటనే ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే (Hyderabad woman critical) ఉన్నట్టు వైద్యులు తెలిపారు. నిందితుడు బస్వరాజ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement