Telangana Shocker: అది హత్యా, ఆత్మహత్యా, కారులో గిరిజన వ్యక్తి సజీవ దహనం, పూర్తిగా కాలిపోయిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టిన మెదక్ జిల్లా పోలీసులు

మెదక్‌ జిల్లా (medak district) టాక్మాల్‌ మండలంలో వెంకటాపురం శివారులో దారుణం చోటుచేసుకుంది. బతికుండగానే కారులో వ్యక్తి సజీవ దహనం ( Man burned alive in a car) అయ్యారు. గత అర్థరాత్రి ఓ వ్యక్తిని కారులో​ వేసి ప్రెటోల్‌ పోసి నిప్పు (Man burned alive) పెట్టిన ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు.

Man burned alive in a car (Photo-Video Grab)

Hyd, Jan 9: మెదక్‌ జిల్లా (medak district) టాక్మాల్‌ మండలంలో వెంకటాపురం శివారులో దారుణం చోటుచేసుకుంది. బతికుండగానే కారులో వ్యక్తి సజీవ దహనం ( Man burned alive in a car) అయ్యారు. గత అర్థరాత్రి ఓ వ్యక్తిని కారులో​ వేసి ప్రెటోల్‌ పోసి నిప్పు (Man burned alive) పెట్టిన ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో కారు నంబర్‌ను దుండగులు పూర్తిగా దహనం చేశారు.ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు ఓ గిరిజన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. మృతిని వివరాలను తెలుసుకునేందుకు ఆరా తీస్తున్నారు. కారు వద్ద బ్యాగుతో పాటు చెట్ల పొదల్లో పెట్రోల్ డబ్బాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇండిగో విమానంలో ఎయిర్‌హోస్టస్‌పై దారుణం, తప్పతాగిన మందుబాబులు మహిళా సిబ్బందిపై వికృతచేష్టలు, అడ్డొచ్చిన విమాన కెప్టెన్‌పై దాడి

చనిపోయిన ఆ వ్యక్తి ఎవరు? ఎవరన్నా హత్య చేసిన ఇక్కడికి తీసుకొచ్చి దహనం చేశారా?లేక సజీవంగా దహనం చేశారా? అనే కోణంలో టేక్మాల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాల కోసం ఆరా తీయగా ధర్మా అనే వ్యక్తిగా గుర్తించారు. అనుమానాస్పద స్థితిలో కారులో భీమ్లా తండాకు చెందిన ధర్మా అనే వ్యక్తి మృతిచెందాడు. హైదరాబాద్ సెక్రటెరియట్‌లో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న 48 ఏళ్ల ధర్మా జనవరి 5న కుటుంబ సభ్యులతో స్వగ్రామానికి వెళ్లాడు.

ఆ తర్వాత కారులో సజీవదహనమయ్యాడు. పూర్తిగా కాలిపోయిన మృతదేహాన్ని చూసిన పోలీసులు ధర్మ ఎలా చని పోయాడు అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. కారు వద్ద ఓ బ్యాగ్‌ను పొదల్లో పెట్రోల్‌ డబ్బాను గుర్తించారు. ఆత్మహత్యా, లేదంటే హత్యనా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలను దర్యాప్తు తరువాత వెల్లడిస్తామని తెలిపారు.

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement