IndiGo Aircraft | Representational Image (Photo Credits: ANI)

New Delhi,  Jan 9: ఎయిరిండియా విమానంలో ఓ ప్రయాణికుడు మద్యం మత్తులో మహిళపై మూత్రవిసర్జన చేసిన ఘటన మరవక ముందే, మరో విమానంలో ప్రయాణికులు తప్పతాగి వికృత చేష్టలకు (Indigo flight shocker) పాల్పడ్డారు. ఎయిర్‌హోస్టస్‌పై లైంగిక వేధింపులకు (2 drunk passengers create havoc) పాల్పడటమేగాక, అడ్డొచ్చిన విమాన కెప్టెన్‌పై దాడి చేశారు. ఆదివారం రాత్రి ఢిల్లీ నుంచి పట్నా వెళ్లిన ఇండిగో(Indigo) విమానంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.

ఈ విమానంలో ముగ్గురు ప్రయాణికులు మద్యం మత్తులో ఫ్లైట్‌ అటెండెంట్‌తో అసభ్యంగా ప్రవర్తించారు. వీరిని అడ్డుకునేందుకు కెప్టెన్‌ ప్రయత్నించగా ఆయనపై దాడికి పాల్పడ్డారు. దీంతో విమాన సిబ్బంది వీరి గురించి ఎయిర్‌పోర్టు అధికారులకు సమాచారమిచ్చారు. రాత్రి 10 గంటలకు విమానం పట్నా విమానాశ్రయంలో దిగగానే సీఐఎస్‌ఎఫ్‌ (CISF) అధికారులు వీరిలో ఇద్దరిని పట్టుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు.

విమానంలో దారుణం, ఫ్యాంట్ జిప్పి విప్పి మహిళా ప్రయాణికురాలిపై మూత్రం పోసిన ఓ వ్యక్తి, సిబ్బందికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని లేఖ రాసిన బాధితురాలు

మరో వ్యక్తి పరారవ్వగా అతడి కోసం గాలిస్తున్నారు. నిందితులంతా బిహార్‌కు చెందినవారేనని అధికారులు గుర్తించారు. కాగా గతేడాది నవంబరు 26న న్యూయార్క్‌ నుంచి దిల్లీ వచ్చిన ఎయిరిండియా (Air India) విమానంలో మహిళపై శంకర్‌ మిశ్రా అనే ప్రయాణికుడు మద్యం మత్తులో మూత్ర విసర్జన చేసిన ఘటన తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నిందితుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయగా.. ప్రస్తుతం అతడు జ్యుడిషియల్‌ రిమాండ్‌లో ఉన్నాడు. ఈ రెండు ఘటనలపై డీజీసీఏ (DGCA) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.