Hyderabad Shocker: మద్యం మత్తులో చనిపోతున్నానంటూ ఫేస్‌బుక్‌లో లైవ్, ఆర్థిక ఇబ్బందులు, ప్రేమ విఫలం కారణంగా లాడ్జిలో ఉరి వేసుకున్న యువకుడు, హైదరాబాద్ నగరంలో విషాద ఘటన

ఆర్థిక ఇబ్బందులు, ప్రేమ విఫలం కారణంగా వివాహమైన ఓ యువకుడు లాడ్జిలో ఆత్మహత్యకు (Man commits suicide) పాల్పడిన సంఘటన వనస్థలిపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శనివారం చోటు చేసుకుంది.

Image used for representation purpose only | PTI Photo

Hyderabad, August 22: ఆర్థిక ఇబ్బందులు, ప్రేమ విఫలం కారణంగా వివాహమైన ఓ యువకుడు లాడ్జిలో ఆత్మహత్యకు (Man commits suicide) పాల్పడిన సంఘటన వనస్థలిపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా పసుపుగల్లు గ్రామానికి చెందిన షేక్‌ బ్రహ్మం(36) లారీ యజమాని. ఇతనికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కరోనా నేపథ్యంలో ఆర్థికంగా నష్టపోయాడు.

శనివారం ఉదయం అతని స్నేహితుడు వేణుగోపాల్‌తో కలిసి వనస్థలిపురం ఆటోసాయినగర్‌లోని వీఎంఆర్‌ లాడ్జిలో ( vanasthalipuram lodge in Hyderabad) గది అద్దెకు తీసుకున్నారు. ఈక్రమంలో మధ్యాహ్నం ఇద్దరూ కలిసి బార్‌లో మద్యం సేవించి గదిలోకి వెళ్లి పడుకున్నారు. తిరిగి సాయంత్రం బార్‌కి వచ్చి మళ్లీ మద్యం సేవించారు. ఆతర్వాత షేక్‌ బ్రహ్మం తన గదికి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లాడు. అనంతరం తాను..చనిపోతున్నానని, ప్రేమించి మోస పోయానని.. స్నేహితులు మోసం చేశారని చెబుతూ ఫ్యాన్‌కు లుంగీతో ఉరేసుకున్నాడు.

రాహుల్‌ హత్యకేసు..పోలీసులకు లొంగిపోయిన నిందితుడు కోరాడ విజయ్‌, రహస్యప్రాంతంలో నిందితుడిని విచారిస్తున్న పోలీసులు, దర్యాప్తును వేగవంతం చేసిన మాచవరం పోలీసులు

ఈ దృశ్యాలు ఫేస్‌బుక్‌ లైవ్‌లో ఉన్నాయి. ఆ సమయంలో స్నేహితులు, బంధువులు ఫోన్‌ చేసినా ఫోన్‌ తీయలేదు. వేణుగోపాల్‌ ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా తీయకపోవడంతో బ్రహ్మం ఉన్న గదికి వెళ్లాడు. గది తలుపులు వేసి ఉండటంతో కిటికీలోంచి చూసే సరికి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. లాడ్జి సిబ్బంది వచ్చి తలుపులు తెరిచే సరికి అప్పటికే మృతి చెందాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బ్రహ్మం మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. బ్రహ్మం బంధువులకు సమాచారమందించారు.

కాగా ఫోన్‌లో మాట్లాడుతూ గదిలోకి వెళ్లిన బ్రహ్మం తాను ఒక అమ్మాయిని ప్రేమించానని.. ఆమె, తన స్నేహితులు కూడా మోసం చేశారని చెబుతూ తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని తన తల్లికి, భార్యకు రికార్డు చేసిన వీడియో పంపాడు.