Telangana Shocker: తల్లిదండ్రులు పెయింటర్‌ను పెళ్లి చేసుకోమన్నారని ఎంబీఏ యువతి ఆత్మహత్య, జీడిమెట్లలో విషాదకర ఘటన

తల్లిదండ్రులు తనకు ఇష్టంలేని పెళ్లి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మనస్తాపం చెందిన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. జీడిమెట్లలో ఈ ఘటన వెలుగు చూసింది.

Suicide (Photo Credits: Twitter)

Hyd, Oct 2: తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. తల్లిదండ్రులు తనకు ఇష్టంలేని పెళ్లి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మనస్తాపం చెందిన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. జీడిమెట్లలో ఈ ఘటన వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సుభాష్‌నగర్ లాస్ట్ బస్టాప్ ప్రాంతంలో ఉండే కరీంశెట్టి జన్ని, సత్యవతి దంపతుల కుమార్తె యువనాగదుర్గ (23) ఎంబీఏ చదువుతోంది.

పండుగ వేళ ఘోర విషాదం, పాకిస్తాన్ మసీదులో ఆత్మాహుతి దాడి, పోలీసు ఉన్నతాధికారితో సహా 52 మంది మృతి, వందల మందికి తీవ్ర గాయాలు

యువతికి పెళ్లి చేయాలనుకున్న తల్లిదండ్రులు స్థానికంగా ఉండే ఓ పెయింటర్‌తో పెళ్లి నిశ్చయించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో నిశ్చితార్థం చేశారు. కొన్ని నెలల తరువాత పెళ్లికి ముహూర్తం నిర్ణయించారు. కాగా, గత నెల 29న యువతి తల్లిదండ్రులు బయటకు వెళ్లారు. ఇంట్లో యువనాగదుర్గ, ఆమె సోదరుడు ఉన్నారు. ఈ క్రమంలో సోదరుడు భోజనం తెచ్చేందుకు బయటకు వెళ్లగా నాగదుర్గ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్లి ఇష్టం లేకే కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆమె తండ్రి పోలీసులకు తెలిపారు.



సంబంధిత వార్తలు