TSPSC Group-1 Notification Released: 563 పోస్టులతో తెలంగాణ గ్రూప్‌ -1 నోటిఫికేషన్‌ విడుదల, వయోపరిమితిని 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు పెంపు

563 పోస్టులతో టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 కొత్త నోటిఫికేషన్‌ను సోమవారం విడుదల చేశారు. ఈ నెల 23వ తేదీ నుంచి మార్చి 14వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. ప్రభుత్వం వయోపరిమితిని 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు పెంచింది

Representational Image (File Photo)

తెలంగాణలో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలైంది. 563 పోస్టులతో టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 కొత్త నోటిఫికేషన్‌ను సోమవారం విడుదల చేశారు. ఈ నెల 23వ తేదీ నుంచి మార్చి 14వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. ప్రభుత్వం వయోపరిమితిని 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు పెంచింది. మార్చి 14న సాయంత్రం ఐదు గంటల వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తారు. మే/జూన్ నెలల్లో ప్రిలిమినరీ పరీక్షలు, సెప్టెంబర్/అక్టోబర్ నెలల్లో మెయిన్స్ నిర్వహిస్తారు.

తెలంగాణలో గ్రూప్‌ -1 నోటిఫికేషన్‌ రద్దు చేసిన టీఎస్‌పీఎస్సీ

పోస్టుల వివరాలు, వయో పరిమితి, వేతనం తదితర పూర్తి వివరాలతో ఈ రోజు సాయంత్రం నోటిఫికేషన్ విడుదల అయింది. దరఖాస్తు తర్వాత ఎడిట్ చేసుకునేందుకు 23 మార్చి ఉదయం 10 గంటల నుంచి 27 మార్చి సాయంత్రం 5 గంటల వరకు అవకాశం కల్పించారు. హాల్ టిక్కెట్‌ను ఏడు రోజుల ముందు నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

తెలంగాణలో గత ప్రభుత్వం 2022లో విడుదల చేసిన పాత గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ను టీఎస్‌పీఎస్సీ సోమవారం రద్దు చేసింది.ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ ఓ ప్రకటనలో పేర్కొంది. 2022లో 503 పోస్టులతో గత ప్రభుత్వం గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే.