IPL Auction 2025 Live

Yellow Alert for TS: రాబోయే రెండు రోజ‌లు బ‌య‌ట‌కు వెళ్లే ముందు ఒక‌టికి రెండు సార్లు ఆలోచించుకోండి! వ‌డ‌గాల్పులు వీచే అవ‌కాశ‌ముందని ఐఎండీ హెచ్చ‌రిక‌, తెలంగాణలో 9 జిల్లాల‌కు ఎల్లో అల‌ర్ట్ జారీ

గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలోని 9 జిల్లాల్లో వడగాలులు వీస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (Hyderabad IMD) హెచ్చరించింది. ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వడగాలుల ప్రభావం ఉంటుందని పేర్కొంది.

Representational picture. (Photo credits: PTI)

Hyderabad, April 24: వచ్చే ఐదు రోజులు దేశ మంతటా వడగాలుల ప్రభావం ఉంటుందని భారత వాతావరణ సంస్థ (IMD) తెలిపింది. ముఖ్యంగా ఐదు రాష్ట్రాల్లో (పశ్చిమబెంగాల్‌, కర్ణాటక, ఒడిసా, ఉత్తరప్రదేశ్‌, బిహార్‌) వడగాలులు (Heat Waves) తీవ్రం కానున్నాయని హెచ్చరించింది. తెలంగాణ, ఏపీ సహా దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికే 40-45 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయని పేర్కొంది. రానున్న ఐదు రోజులపాటు వడగాలులు కొనసాగుతాయని, రాత్రి వేళ కూడా వేడి వాతావరణ నెలకొంటుందని హెచ్చరించింది. పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వడగాలులు వీస్తాయని.. కర్ణాటక, ఒడిసా, ఉత్తరప్రదేశ్‌, బిహార్‌లో నిర్దిష్ట సమయాల్లో వడగాలుల వీస్తాయని పేర్కొంది. రానున్న రెండు రోజుల్లో వాయవ్య భారతంలో గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో స్వల్ప మార్పులు చేసుకుంటాయని, ఆ తర్వాత క్రమంగా 2 నుంచి 4 డిగ్రీలు పెరుగుతాయని తెలిపింది. ఈశాన్య అసోం, ఈశాన్య బంగ్లాదేశ్‌లో తుఫాను వాతావరణం నెలకొందని, ఫలితంగా అరుణాచల్‌ ప్రదేశ్‌, అసోం, మేఘాలయ, నాగాలాండ్‌, మణిపూర్‌, మిజోరం, త్రిపుర, సిక్కిం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. కాగా, ఎండల దెబ్బ ఈ నెల 26న జరిగే రెండో ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. వడగాలులపై ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో శుక్రవారం జరిగే పోలింగ్‌లో ఓటింగ్‌ శాతం తగ్గుతుందని ఎన్నికల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో ఎండలు మండిపోతున్నాయి.

Forest Fire in Telangana: తెలంగాణలో మూడోవంతు అడవులకు అగ్ని ప్రమాదం ఉండే ముప్పు  

దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరుకోవడంతో వడగాలులు వీస్తున్నాయి. తెలంగాణలోనూ పగటి ఉష్ణోగ్రతలు (TS Temperatures) పెరిగిపోతున్నాయి. గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలోని 9 జిల్లాల్లో వడగాలులు వీస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (Hyderabad IMD) హెచ్చరించింది. ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వడగాలుల ప్రభావం ఉంటుందని పేర్కొంది. వడగాలులకు సంబంధించి గురు, శుక్రవారాల్లో ఎల్లో అలర్ట్‌ జారీ చేయగా... శనివారం మాత్రం ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. కాగా బుధ, గురువారాల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది.



సంబంధిత వార్తలు

TG Weather Update: చలితో గజగజలాడుతున్న తెలంగాణ.. సంగారెడ్డి, ఆదిలాబాద్‌ జిల్లాల్లో 9 డిగ్రీల కంటే తక్కువకు పడిపోయిన ఉష్ణోగ్రతలు.. అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరిక

Rains in AP: బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం.. ఎల్లుండి నుంచి ఏపీలో భారీ వర్షాలు.. మూడు రోజుల పాటు సముద్రంలో అలజడి.. మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని అధికారుల హెచ్చరికలు

Rains in AP: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రేపటికల్లా వాయుగుండంగా మారే అవకాశం.. అల్పపీడనం ప్రభావంతో నేటి నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమల్లో వర్షాలు

Heavy Rains in AP: బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం.. వచ్చే వారం ఏపీలో దంచికొట్టనున్న వానలు.. ఐఎండీ అంచనా.. ఉత్తరం నుంచి వీచే గాలుల ప్రభావంతో కోస్తాంధ్రలో పెరగనున్న చలి తీవ్రత