Hyderabad Shocker: హైదరాబాద్‌లో దారుణం, భార్య ప్రైవేట్ భాగాలపై కత్తితో పొడిచి హత్య చేసిన కసాయి భర్త, అడ్డువచ్చిన బంధువుపై కూడా దాడి, పరారీలో నిందితుడు
భార్యపై అనుమానంతొ భర్త ఆమెను కిరాతకంగా హత్య చేశాడు. జియోగూడలో కులుసుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఘటన (Hyderabad Shocker) జరిగింది.
Hyd, July 15: భాగ్యనగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యపై అనుమానంతొ భర్త ఆమెను కిరాతకంగా హత్య చేశాడు. జియోగూడలో కులుసుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఘటన (Hyderabad Shocker) జరిగింది. వివరాల్లోకి వెళితే.. కులుసుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ టిఫిన్ సెంటర్‌లో పని చేస్తున్న సరిత యాదవ్ అనే మహిళను ఆమె భర్త సంతోష్ తన ఇంట్లో ప్రైవేట్ పార్ట్‌లో కత్తితో పొడిచి హత్య ( Woman found murdered in Jiyaguda ) చేశాడు.
అడ్డువచ్చిన మృతురాలు బంధువు పై కూడా కత్తితో దాడికి పాల్పడ్డాడు. గాయపడ్డ వ్యక్తిని ఉస్మానియా ఆసుపత్రి కీ తరలించారు.సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీమ్ దర్యాప్తు చేపడుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. నిందితుడు ప్రస్తుతం పరారీలో వున్నాడు.
సంజయ్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న బాధితురాలు సరిత, ఆమె భర్త సంతోష్ మధ్య తరచూ గొడవలు జరిగేవని సంబంధిత వర్గాలు తెలిపాయి. మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న సంతోష్ తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఆమెను హత్య చేసి పరారీలో ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కుల్సుంపురా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.