Hyderabad: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కోసం పాకిస్తాన్ నుండి అక్రమంగా భారత్‌లోకి, ఆధార్ సంపాదించే క్రమంలో పోలీసులకు చిక్కిన నిందితుడు

భార్య కోసం పాకిస్తాన్ నుండి హైదరాబాద్‌కు అక్రమంగా వచ్చిన యువకుడు అరెస్ట్ అయ్యాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కోసం పాకిస్థాన్ యువకుడు అక్కడి నుండి నేపాల్ మీదుగా భారత్‌లోకి అక్షమంగా ప్రవేశించి హైదరాబాద్ చేరాడు.

young man who illegally came to Hyderabad from Pakistan for his wife was arrested (Photo-X and Wiki)

భార్య కోసం పాకిస్తాన్ నుండి హైదరాబాద్‌కు అక్రమంగా వచ్చిన యువకుడు అరెస్ట్ అయ్యాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కోసం పాకిస్థాన్ యువకుడు అక్కడి నుండి నేపాల్ మీదుగా భారత్‌లోకి అక్షమంగా ప్రవేశించి హైదరాబాద్ చేరాడు. ఆధార్ సంపాదించే క్రమంలో పోలీసులకు పాకిస్తానీ యువకుడు మహ్మద్ ఫయాజ్ చిక్కాడు.పాకిస్తానీకి ఆధార్ కార్డు సృష్టించేందుకు అత్తమామలు ప్రయత్నించారు. ఫయాజ్‌తో పాటు అతని అత్తమామలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మామ షేక్ జుబేర్‌తో పాటు అత్త అఫ్జల్ బేగం పరారీలో ఉంది. పాకిస్తానీ ఫయాజ్ పాస్ పోర్ట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం, డీజిల్ లోడ్‌తో వెళ్తున్న ట్రక్కును ఢీకొట్టిన ప్యాసింజర్ బస్సు, 16 మంది సజీవదహనం, పలువురికి తీవ్రగాయాలు

పాకిస్థాన్‌కు చెందిన ఫయాజ్ అహ్మద్ (24) ఉపాధి కోసం 2018 డిసెంబరులో షార్జా వెళ్లాడు. హైదరాబాద్ కిషన్ బాగ్ ప్రాంతానికి చెందిన నేహ ఫాతిమా(29) సైతం ఉపాధి కోసం 2019లో షార్జా వెళ్లింది. ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారి షార్జాలోనే 2019లో వివాహం చేసుకున్నారు. వారికి ఒక అబ్బాయి ఉన్నాడు. ఫాతిమా ఒక్కతే గతేడాది హైదరాబాద్ వచ్చింది. ఫయాజ్ పాకిస్థాన్ వెళ్లిపోగా ఫాతిమా తల్లిదండ్రులు అతడిని సంప్రదించి హైదరాబాద్ రావాలని గుర్తింపు పత్రాలు వచ్చేలా చూసుకుంటామని హామీ ఇచ్చారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement