TRS MLC Kavitha on Hijab Controversy: స్త్రీలకు సొంతంగా నిర్ణయాలు తీసుకునే శక్తి ఉంది, హిజాబ్ వివాదంపై MLC కల్వకుంట్ల కవిత స్పందన..
హిజాబ్ వివాదంపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. మహిళల వస్త్రధారణ విషయంలో కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. స్త్రీలకు సొంతంగా నిర్ణయాలు తీసుకునే శక్తి ఉందని చెప్పారు.
హిజాబ్ వివాదంపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. మహిళల వస్త్రధారణ విషయంలో కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. స్త్రీలకు సొంతంగా నిర్ణయాలు తీసుకునే శక్తి ఉందని చెప్పారు. ఈ సందర్భంగా తాను రాసిన కవితను ఆమె ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. నుదుటున సింధూరం పెట్టుకోవడం వ్యక్తిగత స్వేచ్ఛ అయినప్పుడు హిజాబ్ ధరించడం ముస్కాన్ వ్యక్తిగత స్వేచ్ఛ అవుతుందని కవిత అభిప్రాయపడ్డారు.
ఎలా ఉండాలి? ఏం చేయాలి? ఏం ధరించాలి? అన్నది మహిళలకే వదిలేయాలని కవిత కోరారు. ఏమతమైనా అందరం భారతీయులమేనని గుర్తుంచుకోవాలని చెప్పారు.
సింధూర్, టర్బన్, హిజాబ్, క్రాస్ ఏది ధరించినా చివరకు మన గుర్తింపు భారతీయతేనని కవిత చురకలంటించారు. హిందూ, ముస్లిం, సిక్కు, క్రిస్టియన్ ఏదైనా వారి సంప్రదాయాలను పాటించేందుకు సహకరించాలని కవిత కోరారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
World Sleep Day: భారతదేశంలో సగం మందికి నిద్ర కరువు, రోజుకు 4 గంటలు కూడా నిద్రపోలేకపోతున్నామని ఆవేదన
Dangerous Stunt On Moving Train: కదులుతున్న రైలు కిటికి పట్టుకుని వేలాడుతూ యువకుడి ప్రమాదకర స్టంట్.. తర్వాత ఏం జరిగింది? (వీడియో)
Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Advertisement
Advertisement
Advertisement