Thiruvananthapuram, January 28: కేరళ రాష్ట్రాన్ని కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వణికిస్తోంది. దాదాపు 94 శాతం పాజిటివ్ శాంపిల్స్ లలో ఒమైక్రాన్ వేరియెంట్ ను (Omicron in Kerala) కనుగొన్నామని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణాజార్జ్ చెప్పారు. కేరళ రాష్ట్రంలో ఒమైక్రాన్ ఇన్పెక్షన్లు పెరుగుతున్నాయని మంత్రి చెప్పారు. కేరళలో మూడో వేవ్ ఒమైక్రాన్ వేరియెంట్ గా స్పష్టమైందని వీణాజార్జ్ (Health Minister Veena George) చెప్పారు. డెల్టా వైరస్ 6 శాతం అని తేలిందని మంత్రి పేర్కొన్నారు.కేరళలో గురువారం 51,739 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. ఇతర ప్రాంతాల నుంచి కేరళకు వచ్చిన వారిలో కొవిడ్ -19 నమూనాలను సీక్వెన్స్ చేయడం వల్ల వారిలో 80 శాతం మంది ఒమైక్రాన్ వేరియంట్‌తో ప్రభావితమయ్యారని, 20 శాతం మందికి డెల్టా వైరస్ సోకినట్లు తేలిందని వీణాజార్జ్ వివరించారు.
భారత్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా భారీ సంఖ్యలో కేసులు వెలుగు చూస్తున్నాయి. మరోవైపు దేశంలో పాటిటివిటీ రేటు క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ రేటు 15.88 శాతానికి పెరిగింది. అంటే ప్రతి 100 మందిలో 15 మంది కోవిడ్ బారిన పడుతున్నారు. ఇక గడిచిన 24 గంటల్లో 2,51,209 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
భారత్‌లో కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ల మార్కెట్ విక్రయానికి అనుమతి
నిన్న కరోనాతో 627 మంది మృత్యువాత పడ్డారు. ఒకే రోజు 3,47,443 మంది కోవిడ్‌నుంచి కోలుకున్నారు. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4 కోట్ల ఆరు లక్షలకు చేరింది. మరణాల సంఖ్య 4,92,327కు చేరింది.