IPL Auction 2025 Live

Vinayak Chaturthi Festivities in HYD: సెప్టెంబర్‌ 10 నుంచి భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవాలు, 19వ తేదీన నిమజ్జన కార్యక్రమం, ప్రభుత్వం రా మెటీరియల్ టైమ్‌కి ఇవ్వాలని కోరిన భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి జనరల్‌ సెక్రెటరీ భగవంత్‌రావు

ఈ ఏడాది అన్ని జాగ్రత్తలతో ఉత్సవాలను నిర్వహించనున్నట్లు ఉత్సవ సమితి జనరల్‌ సెక్రెటరీ భగవంత్‌రావు (Bhagwanth Rao) పేర్కొన్నారు.

Lord Ganesha

Hyderabad, July 17: తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో సెప్టెంబర్‌ 10వ తేదీ నుంచి గణేశ్‌ ఉత్సవాలు (Vinayak Chaturthi Festivities in HYD) నిర్వహించనున్నట్లు భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి (Bhagyanagar Ganesh Utsav Samithi) శనివారం తెలిపింది. ఈ ఏడాది అన్ని జాగ్రత్తలతో ఉత్సవాలను నిర్వహించనున్నట్లు ఉత్సవ సమితి జనరల్‌ సెక్రెటరీ భగవంత్‌రావు (Bhagwanth Rao) పేర్కొన్నారు.

ఈ నెల 23న భాగ్యనగర్ గణేశ్‌ ఉత్సవ సమితి కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఉత్సవాలు సెప్టెంబర్‌ 10న ప్రారంభమై.. 19న ఆదివారం నిమజ్జన కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు.గణేశ్‌ ఉత్సవాలకు 24 రకాల మెడిసినల్ ప్లాంట్స్ ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. నిమజ్జనం సమయానికి జీహెచ్ఎంసీ అధికారులు రోడ్లు బాగు చేయడంతో పాటు తాగునీరు అందుబాటులో ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కరోనా మార్గదర్శకాల మేరకు అన్ని మండపాల వద్ద అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.

పెద్దాయనకు ఎంత కష్టం..వైద్యం కోసం దాచుకున్న రూ.రెండు లక్షల నగదును కొరికేసిన ఎలుకలు, ప్రభుత్వం సహకరించి తన ఆపరేషన్‌కు సాయం చెయ్యాలని వినతి

మండపాలు, దేశ భక్తి, దైవ భక్తి పాటలు మాత్రమే ఉండాలని, డిస్కో పాటలు వద్దొన్నారు. ఉత్సవాలకు ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. ‘‘ప్రభుత్వాన్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం.. రా మెటీరియల్ టైమ్‌కి ఇవ్వాలి అని కోరుతున్నాం’’ అని ఆయన అన్నారు.



సంబంధిత వార్తలు

Harish Rao Serious On Government: గురుకులాలా లేక నరక కూపాలా? రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వ పాల‌న‌పై మాజీ మంత్రి హ‌రీష్ రావు తీవ్ర ఆగ్ర‌హం

MP Raghunandan Rao: మారింది రంగుల జెండా మాత్రమే.. రైతుల బతుకుల్లో మార్పు లేదు..ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ రఘునందన్‌ రావు సూచన

Harish Rao: పీడిత వర్గాలకు అండదండగా ఉంటాం.. ఉద్యమాలు , అరెస్టులు కొత్త కాదు అని తేల్చిచెప్పిన హరీశ్‌ రావు, నరేందర్ రెడ్డి నిర్దోషిగా బయటకు వస్తారని స్పష్టం చేసిన మాజీ మంత్రి

KTR on AMRUT Tender Scam: రాష్ట్రానికి కేటాయించిన రూ.8,888 కోట్ల పనులపై కేంద్రం విచారణ జరిపించాలి, అమృత్‌ టెండర్ల అవినీతిపై అన్ని ఆధారాలున్నాయని తెలిపిన కేటీఆర్