Indian Currency Representational Image (Photo Credits: PTI)

Mahabubabad, July 17: రెక్కల కష్టం చేసి.. చెమటపెట్టి సంపాదించిన 2 లక్షల నగదును ఎలుకలు కొట్టేయండతో (Rats Destroy Currency Notes) అది పనికిరాకుండా పోయాయి. ఈ భాధాకర ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. ఎండ‌న‌క, వాన‌న‌క‌.. నిత్యం కూర‌గాయ‌లు అమ్ముకుంటూ.. వైద్యం కోసం రూ 2 లక్షలు ఓ పెద్దాయన పోగు చేసుకుంటే అవి కాస్తా ఎలుకలకు (rats destroy currency notes worth RS 2 lakh) ఆహారమయ్యాయి. ఈ ఘ‌ట‌న మ‌హ‌బూబాబాద్ జిల్లాలోని వేమునూరు గ్రామ‌పంచాయ‌తీ ప‌రిధిలోని ఇందిరాన‌గ‌ర్ తండాలో చోటు చేసుకుంది.

విషాద ఘటన వివరాల్లోకెళితే.. ఇందిరాన‌గ‌ర్ తండాలో భూక్య రెడ్యా (Bhukya Redya) అనే వృద్ధుడు కూర‌గాయ‌లు అమ్ముకుంటూ జీవ‌నం కొన‌సాగిస్తున్నాడు. అనారోగ్యానికి గురైన రెడ్యా.. వైద్య ఖ‌ర్చుల నిమిత్తం రూ. 2 ల‌క్ష‌ల‌ను దాచి పెట్టాడు. ఆ న‌గ‌దును ఇంట్లోని బీరువాలో దాచాడు. అయితే ఎలుక‌లు బీరువాలోకి దూరి ఆ నోట్ల క‌ట్ట‌ల‌ను ప‌ట‌ప‌ట కొరికేశాయి. ఒక్క నోటును కూడా వ‌ద‌ల‌కుండా తినేశాయి. అన్ని రూ. 500 నోట్లే. ఆ నోట్ల‌ను చూసి రెడ్యా బోరున విల‌పించాడు. ఎలుక‌లు కొరికిన న‌గ‌దును తీసుకుని మ‌హ‌బూబాబాద్‌లోని ఎస్బీఐ బ్యాంక్‌కు రెడ్యా వెళ్లాడు. అక్కడి అధికారులు హైదరాబాద్‌లో ఆర్బీఐ బ్యాంకుకు వెళ్లాలని సూచించారు.

దక్షిణ మధ్య రైల్వే తీపి కబురు, తెలుగు రాష్ట్రాల మధ్య ప్యాసింజర్ రైళ్లు పునరుద్ధరణ, ఈ నెల 19 నుంచి విడతల వారీగా 82 రైళ్లు పట్టాలెక్కుతాయని తెలిపిన దక్షిణమధ్య రైల్వే జీఎం గజానన్ మాల్య

ఆ నోట్లు చెల్లుబాటు కావ‌ని చెప్ప‌డంతో చేసేదేమీ బాధిత వ్య‌క్తి తిరిగి ఇంటికి వెళ్లిపోయాడు. ఎవ‌రైనా త‌న వైద్యం కోసం సాయం చేయాల‌ని రెడ్యా వేడుకుంటున్నాడు. తన రెక్కల కష్టంతో సంపాదించుకున్న డబ్బును ఎలుకలు కొట్టడంతో కన్నీరు మున్నీరుగా విలవిస్తున్నాడు. ప్రభుత్వం సహకరించి తన ఆపరేషన్‌కు సాయం చెయ్యాలని, చిరిగిపోయిన నోట్లు తీసుకుని డబ్బు ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు.