ITR Filing: ఇన్ కమ్ ట్యాక్స్ రిట‌ర్న్స్ దాఖ‌లులో రికార్డుల మోత‌, నిన్న‌టి వ‌ర‌కు 5 కోట్ల‌కు పైగా ఐటీఆర్ ఫైలింగ్స్

గడువు సమీపిస్తుండడంతో ఆదాయపు పన్ను రిటర్నులు (ITR filing) దాఖలు చేసే వారి రోజురోజుకూ పెరుగుతోంది. ఒక్క జులై 26వ తేదీనే 28 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు రిటర్నులు (IT Returns) దాఖలు చేశారని ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్ (IT Department) తెలిపింది. ప్రస్తుత మదింపు సంవత్సరంలో ఇప్పటి వరకు 5 కోట్ల రిటర్నులు దాఖలైనట్లు తెలిపింది.

Income Tax Return (Representational Image; Photo Credit: Pixabay)

Mumbai, July 27: గడువు సమీపిస్తుండడంతో ఆదాయపు పన్ను రిటర్నులు (ITR filing) దాఖలు చేసే వారి రోజురోజుకూ పెరుగుతోంది. ఒక్క జులై 26వ తేదీనే 28 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు రిటర్నులు (IT Returns) దాఖలు చేశారని ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్ (IT Department) తెలిపింది. ప్రస్తుత మదింపు సంవత్సరంలో ఇప్పటి వరకు 5 కోట్ల రిటర్నులు దాఖలైనట్లు తెలిపింది. గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య 8 శాతం అధికమని ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది.

గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఇ-ఫైలింగ్‌ (E filing) పోర్టల్‌పై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల సాంకేతిక సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తమ శాఖకు సాంకేతిక సాయం అందించే ఇన్ఫోసిస్‌కు సూచించినట్లు ఐటీ శాఖ పేర్కొంది. ఒకేసారి పెద్ద సంఖ్యలో రిటర్నుల కోసం పోటెత్తినా ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించామంది. గతేడాది మొత్తం 8.61 కోట్ల రిటర్నులు దాఖలయ్యాయి.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement