Airtel Festival Offer: ఎయిర్‌టెల్ పండగ ఆఫర్లు పై ఓ లుక్కేసుకోండి, అదనపు డేటాతో పాటుగా, ఓటీటీ సదుపాయాల

భారత టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ (Airtel) పండగవేళ.. ప్రీపెయిడ్ యూజర్ల (Prepaid Users) కోసం ప్రత్యేక ఆఫర్‌ తీసుకొచ్చింది. ప్రస్తుతం అందిస్తున్న కొన్ని ప్లాన్లలో అదనపు డేటా, ఓటీటీ సదుపాయాలను జోడించింది. సెప్టెంబర్‌ 11 లోపు రీఛార్జి చేసుకున్నవాళ్లు మాత్రమే ఈ బెనిఫిట్స్‌ పొందుతారు. ఇంతకీ ఎయిర్‌టెల్‌ అదనపు ప్రయోజనాలు అందిస్తున్న ప్లాన్లు గురించి తెలుసుకుంటే..

airtel

రూ.979 ప్లాన్‌: 84 రోజుల వ్యాలిడిటీ, అపరిమిత వాయిస్‌ కాలింగ్‌, రోజుకు 100 ఎసెమ్మెస్‌లు, రోజూ 2జీబీ డేటా వంటి ప్రయోజనాలు ఉన్నాయి. ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ప్లే ప్రీమియం (22+ ఓటీటీ సదుపాయాలు) యాక్సెస్‌, మూడు నెలల పాటు అపోలో 24|7 సర్కిల్‌, ఉచిత హలోట్యూన్‌లు, రివార్డ్ మినీ సబ్‌స్క్రిప్షన్‌ అందిస్తోంది. అదే ఆఫర్‌లో సమయంలో ఈ ప్లాన్‌ రీఛార్జితో అదనంగా 10జీబీ డేటా ఇస్తోంది. వాటి వ్యాలిడిటీ 28రోజులు ఉంటుంది.

భూమి పొర‌ల్లోంచి ఒక్కసారిగా పొగలు.. ఆందోళనతో పరుగెత్తిన హైదరాబాదీలు.. అసలేం జరిగింది?? ఇదిగో వీడియో!

రూ.1029 ప్లాన్‌: రోజుకు 2జీబీ డేటా, 100 ఎస్సెమ్మెస్‌లు, అపరిమిత వాయిస్‌ కాల్స్‌ అందిస్తోంది. దీని వ్యాలిడిటీ 84 రోజులు. 3నెలల పాటు డిస్నీ+ హాట్‌స్టార్‌ సదుపాయం, రివార్డ్‌ మినీ సబ్‌స్క్రిప్షన్‌, అపోలో 24/7 సర్కిల్‌, ఉచిత హలోట్యూన్‌లు ప్రయోజనాలు ఉన్నాయి. ఫెస్టివల్‌ ఆఫర్‌లో రీఛార్జి చేసుకుంటే 10జీబీ డేటా ఉచిత కూపన్‌తో పాటు, ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్‌ ప్లే ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ ఉచితంగా అందిస్తోంది. అయితే వీటి వ్యాలిడిటీ 28రోజులు.

రూ.3,599 ప్లాన్‌: 365 రోజుల వ్యాలిడిటీ, అపరిమిత వాయిస్‌ కాల్స్‌, రోజుకు 100 ఎసెమ్మెస్‌లు, రోజూ 2జీబీ డేటా వంటి ప్రయోజనాలు ఉన్నాయి. మూడు నెలల పాటు అపోలో 24/7 సర్కిల్‌, ఉచిత హలోట్యూన్‌లు యాక్సెస్‌ అందిస్తోంది. అదే ఆఫర్‌ సమయంలో  రీఛార్జి చేసుకుంటే అదనంగా 10జీబీ డేటా, ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ప్లే ప్రీమియం యాక్సెస్‌ ఇస్తోంది. దీని వ్యాలిడిటీ 28రోజులు.

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement