Airtel New Recharge Plan: ఎయిర్‌టెల్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. కొత్త ప్లాన్‌తో రూ.4,000 విలువైన Adobe Express Premium ఉచితం..
ప్రముఖ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం సరికొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రత్యేకించి డిజిటల్ కంటెంట్ క్రియేటర్లు, విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూ. 348 ధరతో ఈ ప్రత్యేక ప్లాన్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.
Airtel New Recharge Plan: ప్రముఖ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం సరికొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రత్యేకించి డిజిటల్ కంటెంట్ క్రియేటర్లు, విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూ. 348 ధరతో ఈ ప్రత్యేక ప్లాన్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. సుమారు రూ. 4,000 విలువ చేసే 'అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం' సబ్‌స్క్రిప్షన్‌ను ఏడాది పాటు ఉచితంగా అందించడమే ఈ ప్లాన్‌లోని ప్రధాన విశేషం.
ఈ నూతన రూ. 348 ప్లాన్ కాలవ్యవధి (వ్యాలిడిటీ) 28 రోజులుగా ఉంటుంది. దీనిలో భాగంగా వినియోగదారులకు ప్రతిరోజూ 2 జీబీ 4జీ డేటా, అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత వాయిస్ కాల్స్ , రోజుకు 100 ఉచిత ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. వీటికి అదనంగా స్పామ్ కాల్ అలర్ట్స్, సైబర్ ఫ్రాడ్ లింక్స్ నుంచి రక్షణ ఇచ్చే నెట్‌వర్క్ సెక్యూరిటీ , 30 రోజుల పాటు ఉచిత హలోట్యూన్స్ సౌకర్యాన్ని కూడా ఎయిర్‌టెల్ ఇందులో పొందుపరిచింది. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న భారతీయులకు షాక్.. అమెరికా గ్రీన్ కార్డ్ ప్రాసెస్ నిలిపివేత..
మరోవైపు కేవలం ఒక్క రూపాయి తేడాతో ఎయిర్‌టెల్ పోర్ట్‌ఫోలియోలో ఇప్పటికే రూ. 349 ప్లాన్ కూడా అందుబాటులో ఉంది. అయినప్పటికీ ఈ రెండింటి ప్రయోజనాల్లో స్పష్టమైన వ్యత్యాసాలు ఉన్నాయి. రూ. 349 ప్లాన్ ద్వారా వినియోగదారులు అపరిమిత 5జీ డేటాను పొందవచ్చు. దీనితో పాటు అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియంతో పాటు యాపిల్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్లు ఆరు నెలల కాలపరిమితితో ఉచితంగా అందుతాయి.
ఈ రెండు రీఛార్జ్ ఆప్షన్లను పరిశీలిస్తే.. ఇంకా 4జీ స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తున్న వారికి లేదా 5జీ నెట్‌వర్క్ అందుబాటులో లేని ప్రాంతాల వారికి, అలాగే క్రియేటివ్ పనుల కోసం పూర్తి ఏడాది పాటు అడోబ్ ఎక్స్‌ప్రెస్ ఉచితంగా కావాలనుకునే వారికి రూ. 348 ప్లాన్ ఎంతగానో ఉపకరిస్తుంది. అలాకాకుండా నిరంతర హై-స్పీడ్ 5జీ డేటానే ప్రధానంగా కోరుకునే వినియోగదారులకు రూ. 349 ప్లాన్ ఉత్తమ ఎంపికగా నిలుస్తుంది. సబ్‌స్క్రైబర్లు తమ నెట్‌వర్క్ లభ్యత , రోజువారీ అవసరాలకు అనుగుణంగా తగిన ప్లాన్‌ను ఎంచుకోవచ్చని ఎయిర్‌టెల్ స్పష్టం చేసింది.