Apple Pay India: PIN, OTP లేకుండానే Apple Pay పేమెంట్.. ఏ ఫోన్లు సపోర్ట్ చేస్తాయి.. భారత్‌లో ఎలా పనిచేస్తుందంటే?

దేశంలో ఐఫోన్ వినియోగదారులు ఎన్నాళ్లుగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాపిల్ పే (Apple Pay) సేవలు ఎట్టకేలకు భారతీయ మార్కెట్లోకి అడుగుపెట్టాయి. యాపిల్ సంస్థ తన ప్రతిష్టాత్మక కాంటాక్ట్‌లెస్ డిజిటల్ పేమెంట్ సేవలను సెప్టెంబర్ 30, 2026 నుంచి దేశవ్యాప్తంగా అధికారికంగా అందుబాటులోకి తీసుకువచ్చింది.

Apple Pay India

Apple Pay India: దేశంలో ఐఫోన్ వినియోగదారులు ఎన్నాళ్లుగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాపిల్ పే (Apple Pay) సేవలు ఎట్టకేలకు భారతీయ మార్కెట్లోకి అడుగుపెట్టాయి. యాపిల్ సంస్థ తన ప్రతిష్టాత్మక కాంటాక్ట్‌లెస్ డిజిటల్ పేమెంట్ సేవలను సెప్టెంబర్ 30, 2026 నుంచి దేశవ్యాప్తంగా అధికారికంగా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సదుపాయం ద్వారా ఐఫోన్, ఐప్యాడ్, యాపిల్ వాచ్ వంటి అనుకూలమైన డివైజ్ ఉన్న యూజర్లు ప్రతిసారీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ భౌతికంగా వెంట తీసుకెళ్లే అవసరం లేకుండా, సులభంగా కాంటాక్ట్‌లెస్ పద్ధతిలో చెల్లింపులు పూర్తి చేయవచ్చు.

భారత్‌లో యాపిల్ పే ప్రవేశపెట్టినప్పటికీ, ప్రారంభ దశలో భాగస్వామ్య సేవలు పరిమితంగానే ఉన్నాయి. ప్రస్తుతం కేవలం యాక్సిస్ బ్యాంక్ (Axis Bank) జారీ చేసిన వీసా (Visa), మాస్టర్‌కార్డ్ (Mastercard) క్రెడిట్ కార్డులను మాత్రమే యాపిల్ వాలెట్ (Apple Wallet) యాప్‌లో జోడించి లావాదేవీలు జరుపుకునే వెసులుబాటు కల్పించారు. దేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన రూపే (RuPay) కార్డులకు గానీ, ఇతర ప్రముఖ బ్యాంకుల కార్డులకు గానీ ప్రస్తుతానికి ఇందులో సపోర్ట్ లభించడం లేదు. రాబోయే రోజుల్లో మరిన్ని బ్యాంకులు, కార్డ్ నెట్‌వర్క్‌‌లతో ఒప్పందాలు కుదుర్చుకుని సేవా పరిధిని పెంచాలని యాపిల్ భావిస్తోంది.

యూపీఐ (UPI) సపోర్ట్ ఉందా?

భారతీయ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో అత్యంత కీలకమైన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ప్రస్తుతం యాపిల్ పేలో భాగం కాదు. అంటే, యాపిల్ పే ద్వారా నేరుగా స్కానర్లను స్కాన్ చేసి యూపీఐ చెల్లింపులు చేయడం లేదా డైరెక్ట్ బ్యాంక్-టు-బ్యాంక్ మనీ ట్రాన్స్‌ఫర్లు చేయడం సాధ్యపడదు. ఇది పూర్తిగా క్రెడిట్ కార్డ్ ఆధారిత కాంటాక్ట్‌లెస్ (NFC) లావాదేవీలు, యాప్‌లు మరియు వెబ్‌సైట్ చెల్లింపుల కోసం మాత్రమే ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది.  రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. రైల్లో ప్రయాణించే ముందు ఈ ఒరిజినల్ ఐడీ తప్పక ఉండాలి.. భారతీయ రైల్వే కీలక సూచన..

ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ వ్యాపారుల వద్ద చెల్లింపులు:

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కాంటాక్ట్‌లెస్ కార్డ్ స్వైపింగ్ మెషీన్లు (POS Terminals) ఉన్న అన్ని ప్రధాన స్టోర్లలో యాపిల్ పే పనిచేస్తుంది. యాపిల్ అధికారిక స్టోర్లతో పాటు బ్లింకిట్ (Blinkit), ఛాయోస్ (Chaayos), క్రోమా (Croma), రిలయన్స్ బ్రాండ్స్, టాటా 1mg (Tata 1mg), జొమాటో (Zomato) వంటి ప్రముఖ ఈ-కామర్స్, డెలివరీ యాప్‌లలో కూడా ఆన్‌లైన్ పేమెంట్ ఆప్షన్‌గా యాపిల్ పే అందుబాటులోకి వచ్చింది. దీనివల్ల ప్రతీసారి కార్డ్ నంబర్, సీవీవీ (CVV), ఎక్స్‌పైరీ డేట్ ఎంటర్ చేసే శ్రమ తప్పుతుంది.

Apple Pay ని ఎలా సెటప్ చేసుకోవాలి?

1. వాలెట్ యాప్ ఓపెన్ చేయడం: ఐఫోన్‌లో ముందే ఉండే 'Apple Wallet' యాప్‌ను ఓపెన్ చేయాలి.

2. కార్డును జోడించడం: స్క్రీన్ పైభాగంలో ఉండే '+' ఐకాన్‌పై ట్యాప్ చేసి, అర్హత కలిగిన యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వివరాలను కెమెరా ద్వారా స్కాన్ చేయాలి లేదా నేరుగా ఎంటర్ చేయాలి.

3. బ్యాంక్ వెరిఫికేషన్: స్క్రీన్‌పై వచ్చే సూచనలను అనుసరించి, బ్యాంక్ నుంచి వచ్చే ఆమోదిత ఓటీపీ (OTP) ద్వారా ధృవీకరణ ప్రక్రియ పూర్తి చేయాలి.

4. ఆల్టర్నేటివ్ మార్గం: యాక్సిస్ బ్యాంక్ మొబైల్ యాప్ ద్వారా కూడా నేరుగా 'Add to Apple Wallet' ఆప్షన్‌ను ఎంచుకుని కార్డును లింక్ చేయవచ్చు.

స్టోర్లలో చెల్లింపులు ఎలా చేయాలి?

ఫేస్ ఐడీ (Face ID) ఉన్న ఐఫోన్ మోడళ్లలో సైడ్ బటన్‌ను రెండుసార్లు (Double Click) నొక్కి, ఫేస్ ఐడీ లేదా పాస్‌కోడ్‌తో అథెంటికేట్ చేయాలి. అనంతరం ఫోన్‌ను కాంటాక్ట్‌లెస్ పేమెంట్ రీడర్ సమీపంలో ఉంచితే కొన్ని సెకన్లలోనే పేమెంట్ పూర్తవుతుంది. టచ్ ఐడీ (Touch ID) ఉన్న పాత మోడళ్లలో హోమ్ బటన్ ద్వారా ఫింగర్‌ప్రింట్ అథెంటికేషన్ పూర్తి చేయవచ్చు. ఇదే పద్ధతిలో జత చేసిన యాపిల్ వాచ్ సైడ్ బటన్ డబుల్ క్లిక్ చేసి కూడా పేమెంట్ చేయవచ్చు.

అత్యాధునిక భద్రతా ప్రమాణాలు:

యాపిల్ పేలో భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. వినియోగదారుల ఒరిజినల్ కార్డ్ నంబర్‌ను డివైజ్‌లో గానీ, యాపిల్ సర్వర్లలో గానీ నిల్వ చేయరు. దానికి బదులుగా 'డివైజ్ అకౌంట్ నంబర్' (Tokenization) అనే ప్రత్యేక ఎన్‌క్రిప్టెడ్ కోడ్‌ను ఉపయోగిస్తారు. ఇది ఫోన్‌లోని 'Secure Element' చిప్‌లో భద్రంగా ఉంటుంది. అందువల్ల వ్యాపారులకు లేదా ఇతరులకు మీ అసలు కార్డ్ వివరాలు తెలిపే అవకాశం ఉండదు. పైగా ప్రతీ లావాదేవీకి ఫేస్ ఐడీ లేదా టచ్ ఐడీ తప్పనిసరి కావడం వల్ల అత్యున్నత భద్రత లభిస్తుంది.

సపోర్ట్ చేసే డివైజ్‌లు:

ఈ సేవలను ఉపయోగించుకోవడానికి iOS 18 లేదా ఆపై వెర్షన్‌తో పనిచేసే iPhone XR, ఆ తర్వాత వచ్చిన మోడళ్లు అర్హమైనవి. అలాగే watchOS 11 వర్షన్ ఉన్న Apple Watch Series 6 లేదా ఆ తర్వాత వచ్చిన యాపిల్ వాచ్ మోడళ్లలో కూడా ఈ సదుపాయం పనిచేస్తుంది. భారత్‌లో యాపిల్ పే రాకతో డిజిటల్ కార్డ్ చెల్లింపుల రంగంలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని చెప్పవచ్చు. మరిన్ని బ్యాంకులు, నెట్‌వర్క్‌లు చేరిన తర్వాత దీని వినియోగం దేశంలో మరింత పెరిగే అవకాశం ఉంది.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement