CERT-In on Apple: ఆపిల్ ప్రోడక్ట్స్ వాడుతున్నారా? అయితే డేంజర్ అలర్ట్, ఆ ఉత్పత్తుల్లో సెక్యూరిటీ లోపాలు ఉన్నాయంటూ హెచ్చరిక, త్వరలోనే కొత్త ఓఎస్‌లో లోపాలు సరిదిద్దే అవకాశం

కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీ సంస్థ- కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ఆఫ్ ఇండియా (CERT-In) తెలిపింది. తత్ఫలితంగా హ్యాకర్లు (Hackers) ఆపిల్ ఉత్పత్తులను హ్యాక్ చేసి యూజర్ల డేటా తస్కరించే అవకాశం ఉందని హెచ్చరించింది.

Apple (Photo Credits: Apple)

New Delhi, SEP 24: ఆపిల్ ఉత్పత్తుల్లో (apple products) తీవ్రమైన భద్రతాపరమైన లోపాలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం అలర్ట్ జారీ చేసింది. ఐ-ఫోన్, ఐపాడ్, ఆపిల్ వాచ్ తదితర ఉత్పత్తుల్లో సెక్యూరిటీ లోపం ఉన్నట్లు గుర్తించామని కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీ సంస్థ- కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ఆఫ్ ఇండియా (CERT-In) తెలిపింది. తత్ఫలితంగా హ్యాకర్లు (Hackers) ఆపిల్ ఉత్పత్తులను హ్యాక్ చేసి యూజర్ల డేటా తస్కరించే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆపిల్ ఉత్పత్తుల్లో సెక్యూరిటీ కాంపొనెంట్ కెర్నెల్‌తోపాటు వెబ్ కిట్ విడి భాగాల్లో లోపాలు ఉన్నాయని సెర్ట్-ఇన్ (CERT-In) తెలిపింది. ఈ లోపాలను అడ్డం పెట్టుకుని యూజర్ల వ్యక్తిగత డేటా తస్కరించే వీలు ఉందని పేర్కొంది. యూజర్ల వస్తువుల్లోకి మాల్వేర్ లింక్‌లు, మెసేజ్‌లు పంపి.. వారి డేటా తస్కరించే అవకాశం ఉందని సెర్ట్-ఇన్ హెచ్చరించింది. ఆపిల్ వాచ్‌లు, టీవీలు, ఐ-ఫోన్లు, మ్యాక్ బుక్స్ సాఫ్ట్ వేర్‌ల్లో లోపాలు ఉన్నాయని సెర్ట్-ఇన్ తెలిపింది.

X Payments Feature: ఎక్స్‌(ట్విట్టర్)లోకి త్వరలో అదిరిపోయే ఫీచర్లు, గూగుల్ పే లాగా చెల్లింపుల యాప్, ఇంకా వీడియో కాలింగ్ తో పాటుగా మరెన్నో ఫీచర్లు 

మ్యాక్ ఓఎస్ వర్షన్ 12.7, మ్యాక్ ఓఎస్ 13.6, వాచ్ ఓఎస్ 9.6.3, వాచ్ ఓఎస్ 10.0.1, ఐఓఎస్ 17.0.1, ఐపాడ్ ఓఎస్ 17.0.1 ఓఎస్‌ల్లో లోపాలు ఉన్నాయని సెర్ట్-ఇన్ తెలిపింది. ఐ-ఫోన్ తాజా వర్షన్ ఓఎస్ ఐఓఎస్ 17.0.1 వర్షన్‌, ఆపిల్ సఫారీ వర్షన్ 16.6.1 లోనూ లోపాలు ఉన్నాయని సెర్ట్-ఇన్ పేర్కొనడంతో త్వరలో ఆపిల్ కొత్త ఓఎస్ అప్ డేట్ రిలీజ్ చేస్తుందని తెలుస్తున్నది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement