DOT Order To Black 28,200 Mobile Handsets: 28,200 మొబైల్ హ్యాండ్‌సెట్‌లను వెంటనే బ్లాక్ చేయాలని డాట్ ఆదేశాలు, 20 లక్షల మొబైల్ కనెక్షన్లను రీ-వెరిఫై చేయాలని ఆర్డర్

అంతేకాకుండా ఏకంగా 20 లక్షల మొబైల్ కనెక్షన్లను రీ-వెరిఫై చేయాలని సూచించింది.

DoT Logo (Photo Credits: X/@DoT_India)

సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలతో పాటు పొంచివున్న డిజిటల్ ముప్పుల నుంచి దేశ ప్రజలను కాపాడేందుకు 28,200 మొబైల్ హ్యాండ్‌సెట్‌లను బ్లాక్ చేయాలంటూ టీఎస్‌పీలకు (టెలికం సర్వీస్ ప్రొవైడర్స్) డాట్ (డిపార్ట్‌మెంట్ టెలికమ్యూనికేషన్) ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ఏకంగా 20 లక్షల మొబైల్ కనెక్షన్లను రీ-వెరిఫై చేయాలని సూచించింది.  ఈ ప్రక్రియలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, రాష్ట్ర పోలీసులు డాట్‌కు సహకారం అందించనున్నారు. భారత్‌లోకి గూగుల్ వాలెట్ వచ్చేసింది, గూగుల్‌ పేకి, గూగుల్‌ వాలెట్‌కి మధ్య తేడా ఏంటో తెలుసుకోండి

కేంద్ర హోంశాఖ, రాష్ట్ర పోలీసుల విశ్లేషణ ప్రకారం 28,200 మొబైల్ హ్యాండ్‌సెట్‌లు వివిధ సైబర్ క్రైమ్‌లలో దుర్వినియోగమయ్యాయి. ఈ మొబైల్ హ్యాండ్‌సెట్‌లతో ఏకంగా 20 లక్షల నంబర్లు ఉపయోగించారు. ఈ సమస్యకు చెక్ పెట్టడంలో భాగంగా 28,200 మొబైల్ హ్యాండ్‌సెట్‌లను బ్లాక్ చేయాలని, ఈ హ్యాండ్‌సెట్‌లకు అనుసంధానించిన 20 లక్షల మొబైల్ కనెక్షన్‌లను తిరిగి నిర్ధారించుకోవాలని టీఎస్‌పీలకు డాట్ స్పష్టం చేసింది. రీ-వెరిఫికేషన్‌లో ఫెయిల్ అయిన కనెక్షన్లను తొలగించాలని సూచించింది.