Firefox to Fire Employees: ఉద్యోగాలకు ఎసరు పెడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. టెక్ రంగంలో కొనసాగుతున్న లేఆఫ్స్, 60 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించిన మొజిల్లా ఫైర్‌ఫాక్స్ !
Mozilla Layoffs: కృత్రిమ మేధ సాంకేతికత రాకతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది తమ ఉద్యోగాలను కోల్ఫోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా మరొక టెక్ కంపెనీ తమ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఫైర్‌ఫాక్స్ వెబ్ బ్రౌజర్ డెవలపర్ అయిన మొజిల్లా టెక్ కంపెనీ, షేక్-అప్‌లో భాగంగా దాదాపు 60 ఉద్యోగాలను తొలగిస్తున్నట్లు సమాచారం. వర్క్‌ఫోర్స్‌లో తగ్గింపు మొజిల్లా ఉద్యోగులలో దాదాపు 5%కి సమానం, ఇది ప్రధానంగా ప్రొడక్ట్ డెవలపర్స్ టీమ్ సభ్యులను ప్రభావితం చేస్తుంది.
మొజిల్లా 2018లో తిరిగి ప్రారంభించిన 3D వర్చువల్ వరల్డ్ అయిన హబ్‌లను కూడా మూసివేయనున్నట్లు సమాచారం. మొజిల్లా సోషల్ పేరుతో దాని మాస్టోడాన్ ఉనికిని కంపెనీ తగ్గించుకుంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను దాని ఉత్పత్తుల్లోకి తీసుకురావడానికి కంపెనీ ఈ చర్యను తీసుకుంది. కంపెనీకి కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) గా లారా ఛాంబర్స్ నియామకం జరిగిన కొద్ది రోజులకు ఈ లేఆఫ్స్ జరగడం గమనార్హం.
మొజిల్లా కంపెనీ తమకు సంబంధించిన అనేక ఉత్పత్తులకు ఇకపై పెట్టుబడులను తగ్గించాలని యోచిస్తోంది. ఇందుకోసం సంస్థకు సేవలందిస్తున్న ఉద్యోగులను తొలగించి, కొత్త ఉద్యోగాలకు కోత పెట్టి, వారి స్థానంలో కృత్రిమ మేధను ఉపయోగించుకోనుంది. పోటీ తీవ్రంగా ఉన్న మరియు ప్రత్యేకమైన ఆఫర్‌ను అందించడం కష్టంగా ఉన్న మార్కెట్ విభాగాలలో కంపెనీ తన పెట్టుబడులను వెనక్కి తీసుకుంటోంది.
Mozilla విడుదల చేసిన ఒక మెమో ప్రకారం.. "ఫైర్‌ఫాక్స్‌లోకి విశ్వసనీయ AI"ని తీసుకురావడంపై దృష్టి సారిస్తుంది. అలా చేయడానికి, పాకెట్, కంటెంట్ మరియు ఫైర్‌ఫాక్స్ ఆర్గనైజేషన్‌తో కంటెంట్‌కు మద్దతు ఇచ్చే AI/ML టీమ్‌లను ఒకచోట చేర్చుతుంది" అని టెక్ క్రంచ్ నివేదించింది.
"మోజ్‌ప్రోడ్‌లో సిబ్బంది తగ్గింపు , తక్కువ హెడ్‌కౌంట్ బడ్జెట్ కారణంగా, పీపుల్ మరియు ఇతర సపోర్ట్ సర్వీసెస్ లలో కొన్ని రోల్స్ ఏకీకృతం చేయబడ్డాయి, తద్వారా మేము మా ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోకు సరైన స్థాయి మద్దతును అందిస్తున్నాము.. మేము తీసుకుంటున్న ఈ చర్యలు వ్యూహాత్మక దిద్దుబాటుకు దారితీస్తాయి" అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.