Flipkart Big Saving Days: మే 2 అర్థరాత్రి నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్, పే లేటర్ ఆప్షన్ ద్వారా లక్ష రూపాయల వరకు కొనుగోలు చేసుకునే అవకాశం
మే 2 అర్థరాత్రి నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, గృహోపకరణాలపై డిస్కౌంట్లు లభించనున్నాయి. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్‌షిప్ యూజర్లు ఒకరోజు ముందుగానే అంటే మే 2 నుంచే ఈ సేల్‌లో పాల్గొనవచ్చని ప్రకటించింది.
ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 2 అర్థరాత్రి నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, గృహోపకరణాలపై డిస్కౌంట్లు లభించనున్నాయి. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్‌షిప్ యూజర్లు ఒకరోజు ముందుగానే అంటే మే 2 నుంచే ఈ సేల్‌లో పాల్గొనవచ్చని ప్రకటించింది. ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ తొలగించమని బలవంతం చేస్తే భారత్ నుంచి వెళ్లిపోతాం, ఢిల్లీ హైకోర్టుకు తెలిపిన వాట్సాప్
బిగ్ సేవింగ్ డేస్ సేల్లో భాగంగా ఎస్‌స్‌బీఐ కార్డు ద్వారా చేసే కొనుగోళ్లపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందించనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తన వెబ్‌సైట్లో పేర్కొంది. ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ ఆప్షన్ ద్వారా లక్ష రూపాయల వరకు కొనుగోలు చేయొచ్చని, వీటిపై నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై 5 శాతం క్యాష్‌బ్యాక్ అందించనుంది. అయితే ఆఫర్లను ఇంకా కంపెనీ ప్రకటించలేదు.