IPL Auction 2025 Live

Google Removed 17 Apps: ఈ యాప్స్ మీ ఫోన్లో ఉంటే వెంటనే డిలీట్ చేయండి, కస్టమర్లను బ్లాక్ మెయిల్ చేస్తున్న 17 స్పైలోన్ యాప్స్‌ను డిలీట్ చేసిన గూగుల్

యూజ‌ర్ల స‌మాచారంపై నిఘా పెట్టాయ‌నే స‌మాచారంతో ప్లేస్టోర్ నుంచి స్పైలోన్‌గా గుర్తించిన దాదాపు 18 యాప్‌లు గూగుల్ తొల‌గించింది.

Google play Representative image (Photo Credit- Twitter)

సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ప్లేస్టోర్ నుంచి ల‌క్ష‌లాది డౌన్‌లోడ్స్ జ‌రిగిన 17 స్పైలోన్ యాప్స్‌ను (Loan Apps) గూగుల్ ఇటీవ‌ల తొల‌గించింది. యూజ‌ర్ల స‌మాచారంపై నిఘా పెట్టాయ‌నే స‌మాచారంతో ప్లేస్టోర్ నుంచి స్పైలోన్‌గా గుర్తించిన దాదాపు 18 యాప్‌లు గూగుల్ తొల‌గించింది. ఈ లెండింగ్ యాప్స్‌ను యూజ‌ర్ల డివైజ్‌ల నుంచి కీల‌క స‌మాచారాన్ని కలెక్ట్ చేసి నిఘా వేసేందుకు అనుకూలంగా డిజైన్ చేశార‌ని స‌మాచారం. ఆపై ఈ స‌మాచారాన్ని రుణ‌గ్ర‌హీత‌ల‌ను బ్లాక్‌మెయిల్ చేసి అధిక వ‌డ్డీల‌ను వ‌సూలు చేసేందుకు వాడుకుంటున్న‌ట్టు గుర్తించారు.

122 యూట్యూబ్ న్యూస్ ఛానెల్‌లను బ్లాక్ చేసిన కేంద్రం, దేశానికి వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేయడమే కారణం

యూజ‌ర్ల‌ను బోల్తా కొట్టించే లోన్ యాప్‌ల వివ‌రాల‌ను ఈఎస్ఈటీ ప‌రిశోధ‌కులు షేర్ చేశారు. తాము వెల్ల‌డించిన 18 యాప్స్‌లో 17 యాప్స్‌ను గూగుల్ తొల‌గించింద‌ని సెక్యూరిటీ కంపెనీ ఈఎస్ఈటీ తెలిపింది. గూగుల్ ఈ యాప్స్‌ను తొల‌గించ‌డంతో యాండ్రాయిడ్ యూజ‌ర్లు కూడా త‌మ ఫోన్ల నుంచి ఈ యాప్స్‌ను తొల‌గించాల‌ని కోరింది.

గూగుల్ తొల‌గించిన యాప్స్‌..

ఏఏ క్రెడిట్‌

అమోర్ క్యాష్‌

గౌయ‌బ‌క్యాష్‌

ఈజీక్రెడిట్‌

క్యాష్‌వావ్‌

క్రెడిబ‌స్‌

ఫ్లాష్‌లోన్‌

ప్రిస్ట‌మోస్‌క్రెడిటో

ప్రిస్ట‌మోస్‌డీక్రెడిటో-యుమిక్యాష్‌

గో క్రెడిటో

ఇన్‌స్టాంటానియోప్రిస్ట‌మో

కార్టెరా గ్రాండె

ర్యాపిడో క్రెడిటో

ఫిన‌ప్ లెండింగ్‌

4ఎస్ క్యాష్‌

ట్రూనైరా

ఈజీక్యాష్‌