Google Tests Verified Check Marks: ఫేక్ వెబ్ సైట్ల‌కు చెక్ పెట్టేందుకు గూగుల్ బిగ్గెస్ట్ ఫీచ‌ర్, ఇది అందుబాటులోకి వ‌స్తే స్కామ‌ర్ల‌కు ఇక చుక్క‌లే

వెరిఫైడ్ బ్యాడ్జ్ ఫీచర్ (Verified).. అంటే.. మీరు విజిట్ చేసిన ఆ వెబ్‌సైట్ ఫేక్ లేదా రియల్ అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. ఒరిజినల్ వెబ్‌సైట్లకు వెరిఫైడ్ బ్యాడ్జ్ కనిపిస్తుంది. దీని ఆధారంగా ఆయా వెబ్‌సైట్లను ట్రస్ట్‌వర్తీ బిజినెస్ వెబ్ సైట్ అని యూజర్లు సులభంగా గుర్తుపట్టవచ్చు.

Credits: X

New Delhi, OCT 05: ప్రపంచ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ (Google) సరికొత్త ప్రైవసీ ఫీచర్ తీసుకొస్తోంది. ఈ కొత్త ఫీచర్ (Google New Feature) సాయంతో ఫేక్ వెబ్‌సైట్లకు చెక్ పెట్టేయొచ్చు. సాధారణంగా గూగుల్ సెర్చ్‌లో (Google Search) ఏదైనా విషయం గురించి సెర్చ్ చేస్తున్నప్పుడు అనేక ఫేక్ వెబ్‌సైట్లు కనిపిస్తుంటాయి. అందులో ఏది రియల్ వెబ్‌సైట్, ఏది ఫేక్ అనేది గుర్తుపట్టడం కష్టమే. కొన్నిసార్లు చాలామంది ఫేక్ వెబ్‌‌సైట్ గురించి తెలియక తమ వ్యక్తిగత వివరాలను ఇవ్వడం ద్వారా సైబర్ నేరగాళ్లకు చిక్కడం వంటివి జరుగుతుంటాయి. ఇలాంటి ఫేక్ వెబ్‌సైట్లను సెర్చ్ నుంచి డీలిస్టు చేసేందుకు గూగుల్ కొత్త ప్రైవసీ ఫీచర్ తీసుకొస్తోంది. అదే.. వెరిఫైడ్ బ్యాడ్జ్ ఫీచర్ (Verified).. అంటే.. మీరు విజిట్ చేసిన ఆ వెబ్‌సైట్ ఫేక్ లేదా రియల్ అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. ఒరిజినల్ వెబ్‌సైట్లకు వెరిఫైడ్ బ్యాడ్జ్ కనిపిస్తుంది. దీని ఆధారంగా ఆయా వెబ్‌సైట్లను ట్రస్ట్‌వర్తీ బిజినెస్ వెబ్ సైట్ అని యూజర్లు సులభంగా గుర్తుపట్టవచ్చు.

వెరిఫైడ్ వెబ్‌సైట్లను (Verified websites) గుర్తించడంతో పాటుమోసపూరిత వెబ్‌సైట్‌లను నివారించడంలో వినియోగదారులకు సాయం చేసేందుకు గూగుల్ సెర్చ్ రిజల్ట్స్‌లో నిర్దిష్ట కంపెనీల పక్కన చెక్‌మార్క్‌లతో అందించనుంది. ప్రస్తుతానికి గూగుల్ ఈ కొత్త వెరిఫైడ్ చెక్ మార్క్ ఫీచర్‌ను టెస్టింగ్ చేస్తోంది.

Cyber Fraud: వర్ధమాన్ గ్రూప్ ఛైర్మన్ డిజిటల్ అరెస్ట్, సీజేఐగా నటిస్తూ రూ. 7 కోట్లు దోపిడి చేసిన సైబర్ గ్యాంగ్, రూ. 5 కోట్లు రికవరీ చేసిన అధికారులు 

లీగల్ వెబ్‌సైట్ల మాదిరిగా కనిపించే తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే ఫేక్ వెబ్‌సైట్‌ల నుంచి వినియోగదారులను రక్షించడమే లక్ష్యంగా గూగుల్ ఈ కొత్త సెక్యూరిటీ ఫీచర్ తీసుకొస్తోంది. ఈ మేరకు గూగుల్ ప్రతినిధి ధృవీకరించారు. విశ్వసనీయ బిజినెస్ గుర్తించడంలో వినియోగదారులకు సాయపడేందుకు కంపెనీ క్రమం తప్పకుండా కొత్త ఫీచర్లతో టెస్టింగ్ చేస్తుందని పేర్కొన్నారు.

ప్రస్తుత టెస్టింగ్‌లో ఈ చెక్‌మార్క్‌లను (Google Check <Marks) సెర్చ్ రిజల్ట్స్‌లో వెరిఫైడ్ బిజినెస్ సైట్ల పక్కన బ్యాడ్జ్ కనిపిస్తుంది. మోసపూరిత వెబ్‌సైట్‌లు తరచుగా సెర్చ్ రిజల్ట్స్‌లో కనిపిస్తాయి. తద్వారా వినియోగదారులు బిజినెస్ లేదా సర్వీసు గురించి తప్పుదారి పట్టించే మోసపూరిత కంటెంట్‌ యాక్సస్ చేస్తారు. అదే వెరిఫైడ్ కంపెనీల సైట్లకు చెక్ మార్కులను అందించడం ద్వారా గూగుల్ ఆయా సైట్ల విశ్వసనీయతను మెరుగుపర్చనుంది.

Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ స్కాం, నీ కూతురు సెక్స్ స్కాండల్‌లో చిక్కుకుందని మహిళకు బెదిరింపులు, గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందిన బాధితురాలు 

సెర్చ్ రిజల్ట్స్‌లో మైక్రోసాఫ్ట్, మెటా, ఆపిల్ వంటి ప్రధాన కంపెనీల అధికారిక సైట్ లింక్‌ల పక్కన బ్లూ వెరిఫైడ్ చెక్‌మార్క్‌లను చూసినట్లు పేర్కొంది. ఆన్‌లైన్ సెర్చ్ రిజల్ట్స్ నావిగేట్ చేస్తున్నప్పుడు యూజర్లలో విశ్వాసం, భద్రతను మెరుగుపరిచేందుకు గూగుల్ చేస్తున్న విస్తృత ప్రయత్నంలో భాగంగా ఈ ఫీచర్ అని చెప్పవచ్చు. వెరిఫైడ్ బ్యాడ్జ్ టెస్టింగ్ ప్రస్తుతం పరిమిత పరీక్ష దశలో ఉంది. అన్ని సెర్చ్ రిజల్ట్స్‌లో విస్తృతంగా గూగుల్ ఎప్పుడు అమల్లోకి తీసుకొస్తుంది అనేదానిపై ఇంకా ఎలాంటి సమాచారం లేదు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Violence Erupts In Manipur: మణిపూర్ లో మళ్లీ చెలరేగిన అల్లర్లు.. భద్రతా సిబ్బంది - కుకీల మధ్య ఘర్షణ, ఒకరు మృతి, ఏడుగురు అరెస్ట్

Cyber Fraud in Hyderabad: హైదరాబాద్‌లో నకిలీ కాల్ సెంటర్ గుట్టు రట్టు, అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకుని లక్షలాది డాలర్లు హాంఫట్,సైబర్ సెక్యూరిటీ బ్యూరో దాడిలో షాకింగ్ విషయాలు వెలుగులోకి..

Punjab Police State-wide Search Operation: డ్రగ్స్‌పై పంజాబ్‌ పోలీసుల ఉక్కుపాదం, ఒక్కరోజే 750కు పైగా ప్రాంతాల్లో 12వేల మందితో సెర్చ్‌ ఆపరేషన్‌, 290 మంది అరెస్ట్‌

EPFO Users Withdraw Money Via UPI Apps: గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యూపీఐలతో ఇకపై పీఎఫ్‌ సొమ్ము విత్‌ డ్రా.. రెండు, మూడు నెలల్లో అందుబాటులోకి కొత్త సదుపాయం.. పూర్తి వివరాలు ఇవిగో..!

Advertisement
Advertisement
Share Now
Advertisement