man Group CEO S P Oswal. (Photo credit: vardhman.com)

New Delhi, Oct: ప్రముఖ వస్త్ర తయారీ సంస్థ వర్ధమాన్ గ్రూప్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ అయిన 82 ఏళ్ల ఎస్‌పి ఓస్వాల్‌ను భారత ప్రధాన న్యాయమూర్తి (CJI), డివై చంద్రచూడ్ తో సహా వివిధ ప్రభుత్వ ఏజెన్సీలకు చెందిన అధికారులుగా నటిస్తూ సైబర్ మోసగాళ్లు రూ. 7 కోట్ల మేర మోసం చేశారు.

పక్కాగా ప్లాన్ చేసిన స్కామ్‌లో నకిలీ పత్రాలు, వర్చువల్ కోర్ట్‌రూమ్, బెదిరింపు వ్యూహాలు ఉన్నాయి, ఇది ఓస్వాల్‌ను రెండు రోజుల పాటు "డిజిటల్ అరెస్ట్"లో ఉంచింది. పోలీసులు ఇప్పటివరకు హ్యాకర్ల నుంచి రూ.5 కోట్లకు పైగా విజయవంతంగా రికవరీ చేశారు. ఈ కేసు దేశంలోనే అత్యంత ముఖ్యమైన మోసం రికవరీలలో ఒకటిగా నిలిచింది.ఆగ‌స్టు 28, 29వ తేదీల్లో డిజిట‌ల్ చోరీకి గుర‌య్యారు.

కేసు పూర్వాపరాల్లోకి వెళితే.. మ‌నీ ల్యాండ‌రింగ్ కేసులో విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని బెదిరిస్తూ సైబ‌ర్ గ్యాంగ్ ఆయ‌న వద్ద నుంచి ఏడు కోట్లు వ‌సూల్ చేశారు. మీ పేరుతో కెన‌రా బ్యాంక్ అకౌంట్ ఉంద‌ని, ఆ అకౌంట్ నుంచి ఆర్థిక అక్ర‌మాలు జ‌రిగాయ‌ని ఆ గ్యాంగ్ బెదిరించింది. ఆ అకౌంట్‌కు న‌రేశ్‌గోయ‌ల్ కేసుతో లింకు ఉన్న‌ట్లు మోస‌గాళ్లు బెదిరించిన‌ట్లు తెలుస్తోంది.

అతి వాడకంతో చేజారిన పరిస్థితి.. యాంటీ బయోటిక్స్‌ పనిచేయని దుస్థితి.. ఐసీఎంఆర్‌ తాజా నివేదిక

వీడియోకాల్ చేసి ఓ ఫేక్ కోర్టురూమ్‌ను సృష్టించారు. ఆ కోర్టు రూమ్‌లో సీజేఐ చంద్ర‌చూడ్ త‌న కేసును విచారిస్తున్న‌ట్లు ఫ్రాడ్‌స్ట‌ర్లు చూపించార‌ని ఓస్వాల్ తెలిపారు. వాట్సాప్ ద్వారా సీజే ఇచ్చిన ఆదేశాలను పంపించారు. ఆ ఆదేశాల ప్ర‌కారం ఓస్వాల్ వేర్వేరు అకౌంట్ల‌లో ఏడు కోట్లు జ‌మ చేశాడు. నరేశ్ గోయ‌ల్ కేసు నుంచి ర‌క్షిస్తామ‌ని హామీ ఇస్తూ.. ఫేక్ సుప్రీంకోర్టు ఆదేశాలు త‌న‌కు పంపిన‌ట్లు ఓస్వాల్ తెలిపారు.

ఓస్వాల్ ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు ఆగ‌స్టు 31వ తేదీన కేసు న‌మోదు చేశారు. కేంద్ర హోంశాఖ ఆధ్వ‌ర్యంలోని సైబ‌ర్ క్రైం సెంట‌ర్ ద్వారా మూడు అకౌంట్ల‌ను సీజ్ చేశారు. వాటి నుంచి 5.25 కోట్లు రిక‌వ‌రీ చేశారు. ఈ నేరం వెనుక అంత‌రాష్ట్ర గ్యాంగ్ ఉన్న‌ట్లు పోలీసులు గుర్తించారు. అతాను చౌద‌రీ, ఆనంద్ కుమార్‌ను గౌహ‌తిలో అరెస్టు చేశారు. ఆ ఇద్ద‌రూ వ్యాపారులే. ఈ కేసులో మాస్ట‌ర్‌మైండ్‌, బ్యాంక్ ఉద్యోగి రూమి కాలిటా కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిమ్మి భ‌ట్టాచార్య‌, అలోక్ రంగి, గులామ్ ముర్తాజా, జాకిర్ కూడా ఈ కేసులో నిందితులుగా ఉన్నారు.