Newdelhi, Sep 24: ఏ వ్యాధి బారినపడ్డా, ఇన్ ఫెక్షన్లు సోకినా.. డాక్టర్ రాసిచ్చారని మనం ‘యాంటీ బయోటిక్స్’ (Antibiotics) వాడేస్తాం. అయితే, వీటి అతి వాడకంతో ఇప్పుడు ఆ ఔషధాలు పనిచేయని పరిస్థితి నెలకొన్నదని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) (ICMR) తాజా నివేదిక వెల్లడించింది. యాంటీ బయోటిక్స్ దుర్వినియోగం వ్యాధికారక క్రిముల సామర్థ్యాన్ని పెంచిందని, ఈ నేపథ్యంలో మూత్రనాళాలు, రక్తనాళాల ఇన్ ఫెక్షన్స్, టైఫాయిడ్, న్యుమోనియా వ్యాధులు సాధారణ యాంటీ బయోటిక్స్ కు లొంగటం లేదని తెలిపింది. ఈ వ్యాధులను నయం చేయటం రానున్న రోజుల్లో సవాల్ గా మారుతుందని నివేదిక అభిప్రాయపడింది.
కారణం ఇదే..
తరుచూ యాంటీ బయోటిక్స్ వాడటంతో ఆ ఔషధాల్ని తట్టుకునే శక్తి వ్యాధి కారక క్రిముల్లో ఏర్పడిందని నిపుణులు చెప్తున్నారు. అందుకే, సాధారణ యాంటీ బయోటిక్స్ కు పైన పేర్కొన్న రోగాలు లొంగటం లేదని తెలిపారు. కాగా దేశంలో యాంటీ బయోటిక్స్ నిరోధకతకు సంబంధించి ఐసీఎంఆర్ నుండి 7వ నివేదికగా ఈ నివేదిక వెలువడింది.
ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా బెజవాడ దుర్గమ్మ గుడి మెట్లు శుద్ధి చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్