Nokia G42 5G: రూ. 10 వేల బడ్జెట్ ధరలో నోకియా 5G స్మార్ట్‌ఫోన్‌, నోకియా G42కి మరొక వేరియంట్ భారత మార్కెట్లో విడుదల, ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకోండి!

Nokia G42 5G Smartphone- Pic: HMD Global

Nokia G42 5G Smartphone: నోకియా బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌ల తయారీదారు అయిన HMD గ్లోబల్, గత ఏడాది అక్టోబర్‌లో భారత మార్కెట్లో నోకియా G42 5Gని విడుదల చేసింది. అయితే ఇప్పుడు ఈ స్మార్ట్‌ఫోన్‌కు మరొక కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. నోకియా G42 5G యొక్క 4GB RAM వెర్షన్‌ను కంపెనీ విడుదల చేసింది. అదనంగా 2G వర్చువల్ RAMకు కూడా సపోర్ట్ చేస్తుంది. మైక్రో SD కార్డ్ ద్వారా మెమొరీని 1TB వరకు విస్తరించవచ్చు. ఇదే కాకుండా మరెన్నో మెరుగైన ఫీచర్లు కలిగిన ఈ హ్యాండ్ సెట్ మీకు మరింత సరసమైన ధరలోనే లభిస్తుంది, రూ. 10 వేల బడ్జెట్ ధరలో మంచి బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ సరికొత్త నోకియా G42 5G స్మార్ట్‌ఫోన్ గొప్ప ఆప్షన్‌గా ఉంటుంది.

నోకియా G42 5G స్మార్ట్‌ఫోన్ అందమైన డైజైన్, ఆకర్షణీయమైన రంగులలో లభ్యమవుతుంది. వినియోగదారులు ఈ ఫోన్‌ను సో గ్రే, సో పర్పుల్ మరియు సో పింక్ అనే మూడు కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయవచ్చు.

ఇంకా Nokia G42 5G స్మార్ట్‌ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి, ధర ఎంత తదితర విషయాలను ఈ కింద తెలుసుకోండి.

Nokia G42 5G స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

కనెక్టివిటీ కోసం డ్యూయల్ 4G VoLTE, 5G, 5G SA / NSA, Wi-Fi 802.11 ac (2.4GHz + 5GHz), బ్లూటూత్ 5.1, GPS/ GLONASS/ బీడౌ, USB టైప్-C 2.0, 3.5mm ఆడియో జాక్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్

ధర రూ. 9,999/-

ఈ స్మార్ట్‌ఫోన్ విక్రయాలు మార్చి 8 నుండి ప్రారంభమవుతాయి. ప్రత్యేకంగా HMD.come మరియు Amazon.inలలో ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయటానికి అందుబాటులో ఉంటుంది.