Warning for Samsung Galaxy Mobile Users: శాంసంగ్‌ ఫోన్ యూజర్లకు భారత ప్రభుత్వం హెచ్చరిక, సెక్యూరిటీ లోపం ఉందని వెంటనే అప్‌డేట్‌ చేసుకోవాలని సూచన

ఆ కంపెనీకి సంబంధించిన స్మార్ట్‌ఫోన్లలో సెక్యూరిటీ లోపాన్ని గుర్తించామని, వెంటనే యూజర్లు తమ ఫోన్లను అప్‌డేట్‌ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వ సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ సూచించింది

Government of India, Samsung (Photo Credit: Wikimedia Commons)

Mumbai, December 14: భారతదేశంలో శాంసంగ్‌ (Samsung) స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులకు కేంద్రం అలర్ట్‌ జారీ చేసింది. ఆ కంపెనీకి సంబంధించిన స్మార్ట్‌ఫోన్లలో సెక్యూరిటీ లోపాన్ని గుర్తించామని, వెంటనే యూజర్లు తమ ఫోన్లను అప్‌డేట్‌ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వ సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ సూచించింది. ఆండ్రాయిడ్‌ 11, 12, 13, 14 ఓఎస్‌తో పనిచేసే శాంసంగ్‌ ఫోన్లలో భద్రతాపరమైన లోపం ఉందని, దీనివల్ల వ్యక్తులకు తెలియకుండానే వ్యక్తిగత డేటాను హ్యాకర్లు దొంగిలించే ప్రమాదం ఉందని పేర్కొంది. కాబట్టి వెంటనే తమ స్మార్ట్‌ఫోన్‌ను లేటెస్ట్‌ సెక్యూరిటీ అప్‌డేట్‌ చేసుకోవాలని ఐటీ మంత్రిత్వ శాఖకు చెందిన సెర్ట్‌ ఇన్‌ (CERT-In) సూచించింది.

ఆదార్ కార్డ్ ఇంకా అప్ డేట్ చేసుకోలేదా? అయితే మీకు గుడ్ న్యూస్, ఫ్రీగా ఆదార్ అప్ డేట్ చేసుకునేందుకు మ‌రో ఛాన్స్

నాక్స్ ఫీచర్లపై కంట్రోలింగ్ లేకపోవడం, ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్‌లో లోపాలు, ఏఆర్‌ ఎమోజీ యాప్‌లో ఆథరైజేషన్ సమస్యలు, నాక్స్ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌లో లోపాలను సరిదిద్దకపోవడం వంటి కారణాల వల్ల ఈ సమస్య తలెత్తిందని సెర్ట్‌-ఇన్‌ తెలిపింది.ఈ లోపాల కారణంగా అటాకర్లు భద్రతాపరమైన అడ్డంకులు అధిమించి సున్నితమైన సమాచారాన్ని తస్కరించే ప్రమాదం పొంచి ఉందని తన నోట్‌లో పేర్కొంది.

New SIM Card Rules: జనవరి 1 నుంచి సిమ్ కార్డుల జారీకి కొత్త రూల్స్, పేపర్ ఆధారిత కేవైసీ వెరిఫికేషన్‌ విధానానికి స్వస్తి, డిజిటల్‌ వెరిఫికేషన్‌ అందుబాటులోకి..  

శాంసంగ్‌ లేటెస్ట్‌ ఫోన్లు అయిన గెలాక్సీ ఎస్‌23, గెలాక్సీ జడ్‌ ఫ్లిప్‌ 5, గెలాక్సీ జడ్‌ ఫోల్డ్‌ 5 సహా ఆండ్రాయిడ్‌ 11, 12, 13, 14తో పనిచేసే డివైజుల్లో ఈ లోపం ఉన్నట్లు సెర్ట్‌-ఇన్‌ పేర్కొంది. యూజర్లు ఫోన్‌ సెట్టింగ్స్‌లోని అబౌట్‌ డివైజ్‌లోకి వెళ్లి లేటెస్ట్‌ సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలని యూజర్లకు సెర్ట్‌-ఇన్‌ సూచించింది.