HCLTech: ఉద్యోగులకు షాకిచ్చిన హెచ్‌సీఎల్‌, ఆఫీసుకు రాకుంటే లీవ్‌ కట్‌ అంటూ కొత్త విధానం, హాజరుతో ముడిపెట్టిన ఐటీ దిగ్గజం

దీని ప్రకారం.. కనీసం వారంలో మూడు రోజులు కార్యాలయాలకు రావాలని,అలా రాని రోజులను లీవ్‌గా పరిగణించాలని నిర్ణయించింది. మనీకంట్రోల్‌ వెబ్‌సైట్‌ ఈ మేరకు ఓ కథనాన్ని ప్రచురించింది

HCLtech (Photo-X)

ప్రముఖ ఐటీ సంస్థ హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్ (HCL Tech) ఉద్యోగులకు షాకిస్తూ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం.. కనీసం వారంలో మూడు రోజులు కార్యాలయాలకు రావాలని,అలా రాని రోజులను లీవ్‌గా పరిగణించాలని నిర్ణయించింది. మనీకంట్రోల్‌ వెబ్‌సైట్‌ ఈ మేరకు ఓ కథనాన్ని ప్రచురించింది.ప్రస్తుతం హెచ్‌సీఎల్‌లో ఉద్యోగులు వారంలో కనీసం మూడు రోజులు చొప్పున కార్యాలయాల్లో పనిచేయాలి. నెలకు 12 రోజుల పాటు ఆఫీసుల నుంచి పనిచేయాలి. అంతకంటే తక్కువ రోజులు కార్యాలయాలకు హాజరైతే.. ఆ రోజుల్ని గైర్హాజరుగా పరిగణించి వారి లీవ్‌ల నుంచి మినహాయిస్తారు.  నిరుద్యోగులకు విప్రో గుడ్ న్యూస్, 10 వేల నుంచి 12 వేల మందిని ఉద్యోగాల్లోకి తీసుకోనున్నట్లు ప్రకటన

ఈ మేరకు కొన్ని టీమ్‌లకు హెచ్‌ఆర్‌ విభాగం నుంచి ఇది వరకే సమాచారం వెళ్లిందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.లీవులన్నీ పూర్తయిన పక్షంలో ఆఫీసుకు రాని రోజును లాస్‌ ఆఫ్‌ పేగా పరిగణిస్తారు.వారంలో కనీసం మూడు రోజులు చొప్పున ఆఫీసుకు రావాలని కంపెనీ నిర్ణయించిన ఐదు నెలలకు ఈ విధానం అమలు చేయడం గమనార్హం. ప్రస్తుతం మూడేళ్లలోపు హెచ్‌సీఎల్‌ ఉద్యోగికి ఏటా 18 లీవ్‌లు, ఒక వ్యక్తిగత లీవ్‌ ఉంటుంది. మూడేళ్లు పైబడిన వారికి 20+2 లీవ్‌లు ఉంటాయి.