Paytm: రైలు టికెట్ల రద్దుపై పూర్తి రిఫండ్‌ ప్రకటించిన పేటీఎం, న్యూమనీ సేవింగ్‌ పేరుతో సరికొత్త ఆఫర్లు,చార్ట్‌ రూపొందించడానికి ముందుగా యూజర్లు రైలు టికెట్లు బుక్‌ చేసుకునే వెసులు బాటు

పేటీఎం.. తన ప్లాట్‌ఫామ్‌ ‘పేటీఎం యాప్‌’ ద్వారా రైలు టికెట్ల బుకింగ్‌పై కొత్త ఆఫర్లను ప్రకటించింది. ట్రైన్ టికెట్ బుకింగ్ వినియోగదారులు కేవలం రూ.15 ప్రీమియం చెల్లించి రైలు టికెట్ల రద్దుపై పూర్తి రిఫండ్‌ను పొందొచ్చని తెలిపింది.

IRCTC (Photo-ANI)

పేటీఎం.. తన ప్లాట్‌ఫామ్‌ ‘పేటీఎం యాప్‌’ ద్వారా రైలు టికెట్ల బుకింగ్‌పై కొత్త ఆఫర్లను ప్రకటించింది. ట్రైన్ టికెట్ బుకింగ్ వినియోగదారులు కేవలం రూ.15 ప్రీమియం చెల్లించి రైలు టికెట్ల రద్దుపై పూర్తి రిఫండ్‌ను పొందొచ్చని తెలిపింది. న్యూమనీ సేవింగ్‌ పేరుతో ప్రవేశపెట్టిన ఈ సదుపాయం యూజర్లకు మరింత సౌకర్యవంతమైన అనుభవాన్ని ఇస్తుందని పేటీఎం మాతృసంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ తెలిపింది.

తత్కాల్‌ సహా సహా అన్ని రకాల రైలు టికెట్ల రద్దుపై అప్పటికప్పుడే సోర్స్‌ అకౌంట్‌ (చెల్లింపులు చేసిన బ్యాంక్‌ ఖాతా లేదా కార్డ్‌)కు రిఫండ్‌ పొందొచ్చని ప్రకటించింది. రిఫండ్‌ కోసం రోజులకొద్దీ వేచి చూడాల్సిన అవసరం లేదని పేర్కొంది. రైలు ప్రారంభానికి ఆరు గంటల ముందు లేదంటే చార్ట్‌ రూపొందించడానికి (వీటిలో ఏది ముందు అయితే అదే వర్తిస్తుంది) ముందుగా యూజర్లు రైలు టికెట్లు బుక్‌ చేసుకోవచ్చని వివరించింది.

క్రికెట్ ప్రపంచ కప్ 2023 మొదటి రోజు, గూగుల్ డూడుల్ ఇదిగో, రెండు బాతులు రన్స్ తీస్తున్నట్లుగా గూగుల్ హోమ్ పేజీలో ప్రత్యేక డూడుల్‌

‘‘మొబైల్‌ చెల్లింపులు, క్యూఆర్‌ టెక్నాలజీలో ప్రముఖ సంస్థగా ఉన్న పేటీఎం, ట్రావెల్‌ బుకింగ్‌లకు సంబంధించి మెరుగైన అనుభవాన్ని ఇచ్చేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఉన్న ఫళంగా రైలు టికెట్లు రద్దు చేసుకునే వారికి ఈ కొత్త సుదపాయం ఉపశమనాన్ని ఇస్తుంది’’అని పేటీఎం అధికార ప్రతినిధి తెలిపారు. రైలు టికెట్లు బుకింగ్‌కు యూపీఐ ద్వారా చెల్లింపులు చేస్తే గేట్‌వే ఫీజు వసూలు చేయడం లేదని పేటీఎం తెలిపింది.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Special Trains For Holi: హోలీ పండుగ కోసం స్పెషల్ ట్రైన్స్‌, దక్షిణ మధ్య రైల్వే నడుపుతున్న ట్రైన్లు ఎక్కడెక్కడి నుంచి ప్రారంభమవుతున్నాయో చూడండి

Rules Change In Railways: వెయిటింగ్‌ లిస్ట్‌ ప్రయాణికులకు జనరల్‌ బోగీల్లోనే ప్రయాణించాలి.. ఏసీ, స్లీపర్‌ బోగీల్లో ప్రయాణిస్తే జరిమానా.. ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిన రైల్వే కొత్త నిబంధనలు

TGSRTC: హైదరాబాద్ నుండి బెంగుళూరు వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్, టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి టికెట్ ఛార్జీలో 10 శాతం రాయితీ

Tirumala Darshan Tickets For Tourism Department: ఇకపై పర్యాటక శాఖ నుంచి తిరుమల దర్శన టికెట్లు, అన్ని రాష్ట్రాల ఆర్టీసీ, పర్యాటక శాఖ ద్వారా దర్శన టికెట్లు జారీ

Advertisement
Advertisement
Share Now
Advertisement