BrahMos Cruise Missile: దుమ్మురేపిన బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ మిసైల్, 400 కిలోమీటర్ల దూరంలో ఏమున్నా భస్మీ పటలం చేసే శక్తి దీని సొంతం, మిసైల్‌ను ప్రయోగించడం రెండోసారి
స్వదేశీ బూస్టర్, ఎయిర్‌ఫ్రేమ్ విభాగంతో పాటు అనేక ఇతర మేడ్ ఇన్ ఇండియా ఉప వ్యవస్థలను కలిగి ఉన్న “బ్రహ్మోస్” సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి (BrahMos Cruise Missile) ఒడిశాలోని ఐటీఆర్ బాలాసోర్ నుంచి ఈ రోజు ఉదయం 10.30 గంటలకు నిర్వహించిన ప్రయోగం విజయవంతం అయినట్టు ప్రకటించారు. దీంతో డీఆర్డీవో (DRDO) ఛైర్మన్ సతీష్ రెడ్డి, ఇతర సిబ్బందిని భారత ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు.
Balasore, September 30: బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ మిసైల్ ప్రయోగాత్మక పరీక్ష బుధవారం విజయవంతమైంది. స్వదేశీ బూస్టర్, ఎయిర్‌ఫ్రేమ్ విభాగంతో పాటు అనేక ఇతర మేడ్ ఇన్ ఇండియా ఉప వ్యవస్థలను కలిగి ఉన్న “బ్రహ్మోస్” సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి (BrahMos Cruise Missile) ఒడిశాలోని ఐటీఆర్ బాలాసోర్ నుంచి ఈ రోజు ఉదయం 10.30 గంటలకు నిర్వహించిన ప్రయోగం విజయవంతం అయినట్టు ప్రకటించారు. దీంతో డీఆర్డీవో (DRDO) ఛైర్మన్ సతీష్ రెడ్డి, ఇతర సిబ్బందిని భారత ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు.
బ్రహ్మోస్ ల్యాండ్-ఎటాక్ క్రూయిస్ క్షిపణి (ఎల్ఐసీఎం) మాక్ 2.8 యొక్క వేగంతో ప్రయాణం చేయగలదు.. అద్భుతమైన మిషన్ కోసం పనిచేసిన “బ్రహ్మోస్” సిబ్బందిని ఈ సందర్భంగా డీఆర్డీవో ఛైర్మన్ డాక్టర్ సతీష్ రెడ్డి అభినందించారు. 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను సైతం చేధించగల శక్తి సూపర్ సోనిక్ బ్రహ్మోస్ క్రూయిజ్మిసైల్ (Supersonic Cruise Missile) సొంతం. జే -10 ప్రాజెక్ట్ కింద భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ డీఆర్డీవో ఈ పరీక్షను విజయవంతంగా నిర్వహించింది.
ఒడిశాలోని ఓ కేంద్రం నుంచి భూమిపై నుంచి దీనిని ప్రయోగించారు. ఈ పరీక్ష విజయవంతం కావడం సూపర్‌సోనిక్ క్రూయిజ్ మిసైల్‌కు దేశీయ సత్తా జతకూడటానికి బాటలు పరుస్తుందని చెప్పారు. డీఆర్‌డీవో పీజే-10 ప్రాజెక్టు క్రింద ఈ పరీక్షను నిర్వహించినట్లు తెలిపారు. దేశీయ బూస్టర్‌తో దీనిని నిర్వహించారు. లక్ష్య పరిథిని పెంచి అభివృద్ధిపరచిన ఈ మిసైల్‌ను ప్రయోగించడం ఇది రెండోసారి. దీనికి దేశీయంగా అభివృద్ధిపరచిన ఎయిర్‌ఫ్రేమ్, బూస్టర్ ఉపయోగించారు.
బ్రహ్మోస్ అనేది రామ్‌జెట్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ మిసైల్. దీనిని జలాంతర్గాములు, నౌకలు, యుద్ధ విమానాల నుంచి, భూమిపై నుంచి ప్రయోగించవచ్చు. రష్యాలోని ఓ సంస్థతో కలిసి డీఆర్‌డీవో దీనిని అభివృద్ధిపరిచింది. బ్రహ్మోస్ ఫస్ట్ వెర్షన్‌ను భారత నావికా దళంలో 2005లో ప్రవేశపెట్టారు. మొట్ట మొదట ఐఎన్ఎస్ రాజ్‌పుట్ నౌకలో దీనిని ఏర్పాటు చేశారు.
భారతదేశం, రష్యా మధ్య జాయింట్ వెంచర్‌లో భాగంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ క్షిపణిని మొదట 290 కిలోమీటర్ల పరిధితో రూపొందించారు. అయినప్పటికీ, సామర్థ్యాన్ని పెంచడంలో భాగంగా, క్షిపణి పరిధిని 400 కిలోమీటర్లకు విస్తరించింది. కాగా, కొన్ని అంచనాల ప్రకారం, సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి 450 కిలోమీటర్ల వరకు లక్ష్యాలను చేరుకోగలదు. విస్తరించిన శ్రేణి బ్రహ్మోస్ క్షిపణి మొదటి పరీక్షను మార్చి 2017 లో నిర్వహించారు.
ఒడిశాలోని ప్రయోగ కేంద్రం నుంచి టెస్ట్ ఫైర్ చేసిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణిని భూమి మీద నుంచి ప్రయోగించవచ్చు. అదేవిధంగా, సబ్ మెరైన్ల నుంచి, యుద్ధ నౌకల నుంచి, ఫైటర్ జెట్ విమానాల నుంచి ప్రయోగించవచ్చు. ఈ క్షిపణిని రష్యాకు చెందిన ఫెడరల్ స్టేట్ యూనిటరీ ఎంటర్‌ప్రైజ్ ఎన్పీవో మషినో స్ట్రోనియలతో కలిసి డీఆర్డీఓ సంయుక్తంగా నిర్మించింది. విస్తరించబడిన ఈ క్షిపణి పరిధిలోకి చైనాలోని కీలక నగరాలు కూడా వస్తుండటం గమనార్హం.