New Delhi, July 27: నేడు భారత మాజీ రాష్ట్రపతి, మిస్సైల్ మ్యాన్ డాక్టర్ ఏపీబీ అబ్దుల్ కలాం 5వ వర్ధంతి. ఆయన వర్థంతి (APJ Abdul Kalam 5th Death Anniversary) సంధర్భంగా పలువురు నివాళులు అర్పించారు. ట్విట్టర్ వేదికగా హోం మంత్రి అమిత్ షా (Amit Shah) , రవిశకంర్ ప్రసాద్, రాష్ట్రపతి, బిజెపి పార్టీ ఇలా పలువురు ఆయనకు నివాళి అర్పించారు. ఆ ఫోన్ కాల్‌కి కలాం లొంగి ఉంటే నేడు భారత్ పరిస్థితి ఏమై ఉండేది? అణురంగంలో విప్లవాత్మక మార్పులు జరిగేవా? డూ ఆర్ డై వెనుక ‘మిస్సైల్ మ్యాన్’ పడిన కష్టంపై విశ్లేణాత్మక కథనం
అబ్దుల్ కలాం జీవితం (APJ Abdul Kalam Biography) ఎంతో మందికి స్ఫూర్తి. ఇక ఆయన ప్రసంగాలు (Abdul Kalam Most Inspirational Messages) కుర్రాళ్లకు జీవిత పాఠాలు. అబ్దుల్ కలాం పేరు వింటే గుర్తొచ్చేవి స్ఫూర్తినిచ్చే ఆయన మాటలు. యువతలో ఆయన ప్రసంగాలకు, కొటేషన్లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.
భారతదేశంలో ఉన్న అతికొద్దిమంది గొప్ప శాస్త్రవేత్తల్లో ఏపీజే అబ్దుల్ కలాం (A.P.J Abdul Kalam) ఒకరు. పూర్తి పేరు డాక్టర్ అవుల్ ఫకీర్ జైనుల్లాబ్దీన్ అబ్దుల్ కలామ్. 1931, అక్టోబర్ 15వ తేదీన తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో జన్మించారు. తల్లిదండ్రులు అషియమ్మ జైనుల్లాబ్దీన్, జైనుల్లాబ్దీన్ మరకయార్. ఓ మధ్యతరగతి ముస్లిం కుటుంబంలో పుట్టిన కలాం 1958లో మద్రాస్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ ఎం) నుంచి ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పుచ్చుకున్నారు.
BJP's tweet paying tribute to Dr Kalam:
Remembering Bharat Ratna Dr. APJ Abdul Kalam on his death anniversary as New India walks towards his vision. pic.twitter.com/Pws36YJTXN
— BJP (@BJP4India) July 27, 2020
పట్టభద్రుడైన తర్వాత ఆయన భారతదేశపు రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (డి.ఆర్.డి.ఒ)లో ఒక విఫలమైన హోవర్ క్రాఫ్ట్ ప్రాజెక్టు మీద పనిచేయడానికి చేరారు. 1962లో భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోలో చేరారు. అక్కడ ఆయన ఇతర శాస్త్రవేత్తలతో కలసి అనేక కృత్రిమ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించారు. రోహిణి ఉపగ్రహాన్ని జూలై 1980లో విజయవంతంగా భూమి సమీప కక్ష్యలోకి వదిలిన భారతదేశపు తొలి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనం (SLV-III)ని అభివృద్ధి చేయడంలో ప్రాజెక్టు డైరెక్టరుగా ఆయన కృషి ఎంతో ఉంది.
Here's what Amit Shah tweeted:
Tributes to Dr APJ Abdul Kalam, an epitome of intellect, wisdom and simplicity. A People’s President, who left indelible marks on several fields ranging from science to politics. His relentless quest for knowledge continues to inspire and capture the idea of self-reliant India. pic.twitter.com/YS8p8FjYxE
— Amit Shah (@AmitShah) July 27, 2020
1982లో, ఆయన డీఆర్డీవో డైరక్టరుగా తిరిగి బాధ్యతలు చేపట్టి గైడెడ్ మిస్సైల్స్‌పై దృష్టి కేంద్రీకరించారు. అగ్ని, పృథ్వి క్షిపణి మిస్సైళ్ళ అభివృద్ధి చేసి ప్రయోగించడంలో కీలక పాత్ర పోషించారు. దేశానికి తొలి మిస్సైల్‌ను అందించిన ఘనత ఆయనదే. అందుకే ఆయనకు "మిస్సైల్ మాన్" అనే పేరు (Missile Man of India) కూడా వచ్చింది. ఆ తర్వాత జూలై 1992లో దేశ రక్షణ మంత్రికి సాంకేతిక సలహాదారుగా నియమితులయ్యారు. అలాగే, భారత ప్రభుత్వానికి ప్రధాన సాంకేతిక సలహాదారుగా కేబినెట్ హోదాలో కొనసాగారు. అబ్దుల్ కలాం కృషి ఫలితంగా 1998లో పోఖ్రాన్-II అణుపరీక్షలు విజయవంతంగా పూర్తి చేయడంజరిగింది. ఈ అణు పరీక్షతో భారతదేశాన్ని అణ్వస్త్రరాజ్యాల సరసన చేర్చిన ఘనత ఆయనకే దక్కుతుంది.
Ravi Shankar Prasad remembers Dr Kalam on his 5th death anniversary:
My tribute to the former President of India, great teacher and eminent scientist "Bharat Ratna"
Dr. #APJAbdulKalam Ji on his death anniversary. pic.twitter.com/VYkoWedxhM
— Ravi Shankar Prasad (@rsprasad) July 27, 2020
ఈయనకు భారతదేశ అత్యున్నత పురస్కారాలైన పద్మ భూషణ్ (1981), పద్మ విభూషణ్ (1990), భారతరత్న (1997)లు వరించాయి. అలాగే, దేశంలో ఉన్న విశ్వవిద్యాలయాల్లో కనీసం 30వరకు యూనివర్శిటీలు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశాయి. గత ఎన్డీయే ప్రభుత్వ హయాంలో వాజ్‌పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో అంటే 2002 జూలై 18వ తేదీన భారత రాష్ట్రపతిగా ఎన్నిక కాగా, జూలై 25న రాష్ట్రపతి భవన్‌లో అడుగుపెట్టారు.
Congress party pays tribute to the Missile Man:
We pay our heartfelt tribute to the 'Missile Man of India' and our Former President Dr. A. P. J. Abdul Kalam. His spirit of inquiry and humbleness inspires millions of Indians in their quest for knowledge and truth even today. pic.twitter.com/3K5yCNFxPt
— Congress (@INCIndia) July 27, 2020
ఈయనకు నాటి ఎన్డీయే మిత్రపక్షాలతో పాటు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇవ్వడంతో 90 శాతానికి పైగా ఓట్ల మెజార్టీతో రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. అబ్దుల్ కలాంపై వామపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా 87-ఏళ్ళ లక్ష్మీ సెహగల్ పోటీ చేశారు.
అబ్దుల్ కలాం పూర్తిగా శాకాహారి. మధ్యపాన వ్యతిరేకి. బ్రహ్మచారి. ఖచ్చితమైన వ్యక్తిగత క్రమశిక్షణను పాటిస్తారు. "ప్రజలు.. తమ భార్యాపిల్లలకు తమ పిల్లల పిల్లలకూ ఆస్తులు సంపాదించి పెట్టడం కోసమే అవినీతిపరులౌతారు" అంటూ ఆయన బ్రహ్మచర్యాన్ని స్వీకరించారు. ఇస్లాం ప్రకారమైతే ప్రతి ముస్లిమూ పెళ్ళి చేసుకోవాలి. కానీ, కలాం ఖురాన్‌తో పాటు, భగవద్గీతను కూడా చదువుతారు. మతఘర్షణలను నిరసించే శాంతికాముకుడిగా పేరుగడించారు. ఈయన వింగ్స్ ఆఫ్ ఫైర్, సైంటిస్ట్ టు ప్రెసిడెంట్ వంటి అనేక పుస్తకాలను రచించారు.
కలాం కొటేషన్లు
1.మీరు సూర్యుడిలా వెలగాలనుకుంటే... ముందు సూర్యుడిలా రగిలిపోవాలి.
2. మీ కలలు నిజం కావాలంటే ముందు కలలు కనండి.
3. మీరు రెక్కలతో జన్మించారు. పాకకండి. రెక్కల్ని ఉపయోగించి ఎగరడం నేర్చుకోండి.
4. ఆకాశాన్ని చూడండి. మనం ఒంటరివాళ్లం కాదు. విశ్వమంతా మనతో స్నేహంగా ఉంటుంది. కలలు కనేవారికి, కష్టపడేవారికి మంచి చేస్తుంది.
5. మనిషికి కష్టాలు అవసరం. ఎందుకంటే విజయాన్ని ఆస్వాదించాలంటే కష్టాలు ఎదుర్కొనాలి.
6. మీ జీవితంలో ఎలాంటి ఆటుపోట్లు వచ్చినా సరే ఆలోచనే మీ పెట్టుబడి కావాలి.
7. మీరు మాట్లాడేప్పుడు నిజం మాత్రమే చెప్పాలి. మీ మాట నిలబెట్టుకోవాలి. విశ్వాసాన్ని ప్రదర్శించాలి. మిమ్మల్ని ఇబ్బందిపెట్టేవాటిలో చిక్కుకోకుండా చూసుకోవాలి.
8. మొదటి విజయం తర్వాత విశ్రాంతి తీసుకోవద్దు. ఎందుకంటే మీరు రెండోసారి ఓడిపోవచ్చు. మీ మొదటి విజయం కేవలం అదృష్టం మాత్రమేనని చెప్పడానికి చాలా నోళ్లు ఎదురుచూస్తుంటాయి.
9. నాకు తెలిసిందల్లా నేను నా లక్ష్యం పట్ల జాగరుకుడిగా దృష్టి కేంద్రికరించి ఉండాలని మాత్రమే.
10. భారతీయ అంతరిక్ష కార్యక్రమ ప్రయాణం యథార్ధంగా మొదలయ్యింది రోహిణీ ప్రయోగంతోనే.
11. విజయాన్ని సాధించాలనే లక్ష్యం నీకు ఉన్నప్పుడు.. ఆ లక్ష్యం పై పూర్తి ఏకాగ్రత సారించు.. నీ లక్ష్యం నెరవేరుతుంది.
12. ప్రతి శిశువూ కొన్ని సహజ లక్షణాలతో ఒక నిర్దిష్ఠ సాంఘిక ఆర్ధిక భావావేశ వాతావరణంలో జన్మిస్తాడు.
13. నాకు తెలిసినంత వరకూ భూమి అత్యంత శక్తివంతమైన గతిశీల గ్రహం.
14. కొంతమంది మనుషులు సైన్స్ అనేది వేరే ఒక అంశమనట్టుగా, అది మనిషిని భావంతుడినుంచి దూరం చేస్తుందన్నట్టుగా ఎందుకు మాట్లాడుతారో నాకర్ధం కాదు. విజ్ఞాన శాస్త్ర పథం మానవ హృదయ వీధుల్లోంచి సాగి పోయేదే. నాకయితే సైన్స్ ఎప్పుడూ ఆధ్యాత్మిక ఉన్నతికీ, ఆత్మ సాక్షాత్కారానికి మార్గంగేన్ ఉంటూ వచ్చింది.
15. ఆత్మాభిమానం అన్నది ఆత్మవిశ్వాసంతోనే వస్తుందన్నది మనం ఎందుకు అర్ధం చేసుకోము?
16. స్థిరంగా కనిపించే ప్రతిదానిలోనూ ఒక తీవ్ర చలనం నిబిడికృతమై ఉంటుంది.
17. బృంద నాయకత్వం వహించే వారిలో తరచూ రెండు రకాల ధోరణులు కానవస్తాయి. కొందరికి పని ముఖ్యం. కొందరికి పనికన్నా తమ సహచరులు ముఖ్యం. చాలామంది ఈ రెండు దృక్పథాల మధ్యలో ఎక్కడో ఒక చోట ఉంటారు.
18. ఒక సారి నీ మనసు ఒక స్థాయిలో ఆలోచించడం మొదలయ్యాక తిరిగి పాత ప్రమాణల్లో ఆలోచించడం ఇంకెంత మాత్రం సాధ్యం కాదు.
19. ఇంతవరకు నేను ఆకాశమే సరిహద్దు అనుకున్నాను...కానీ ఇప్పుడర్ధమయ్యింది హద్దులు చాలా దగ్గరగానే ఉన్నాయని..జీవితాన్ని శాసించే సరిహద్దులున్నాయి.
20. 'నువ్వింత బరువే మోయగలవు', 'నువ్వింత త్వరగానే నేర్వగలవు', 'నువ్వింత కష్టమే పడగలవు', 'నువ్వింత దూరమే పోగలవు' అంటూ.
21. సంక్షోభం నుంచి,వేధన నుంచి, విషాదం నుంచి, వైఫల్యం నుంచి మనిషిని లేవనెత్తి అతన్ని సరైన మార్గానికి చేర్చే ఒక దివ్య శక్తి వుందని మనస్ఫూర్తిగా నమ్మాను.
22. మనిషి తన భౌతిక మానసిక బంధాలనుంచి బయట పడినపుడే అతడు స్వేఛ్ఛ, ఆనందం, మానసిక శాంతి దిశగా ప్రయణించగలడని తెలుసుకున్నాను.
23. అంతగా నిశితంగా చూడనివారికి మనం సుందరంగా ఆకర్షణీయంగా కనిపించవచ్చు . కానీ విమర్శనాత్మకంగా చూడగలిగిన వారికి మనం మన వివిధ రకాల నాయకుల వికృత అనుకరణలుగానే కనిపిస్తాం.
24. జీవితం ఒక కఠినమైన ఆట. కేవలం ఒక వ్యక్తిగా నీ జన్మహక్కును నిలబెట్టుకున్నపుడు మాత్రామే దాన్ని నువ్వు గెలవగలవు.
25. భారతదేశంలో మనం చదివేది కేవలం చావు,అనారోగ్యం, తీవ్రవాదం,నేరాల గురించే.
సమస్యలు నిన్ను ఆదేశించుటకు అనుమతించకు.
26. మనమందరం మనలో ఒక దివ్యాగ్నితో జన్మించాం. మన ప్రయత్నాలెప్పుడూ ఆ అగ్నికి రెక్కలిచ్చేలా ఉండాలి.తద్వారా ఈ ప్రపంచమంతా సత్ప్రకాశంతో వెలుగు పొందాలి.
27. ఆదరంగా సాహసంగా సత్యంగా క్షణ క్షణం సుదీర్ఘ దినాంత వేళ దాకా పనిచేసే హస్తాలే సుందరాలు.
28. ఏ మతము ఇతరులను చంపమని ఆదేశించలేదు, దాని యొక్క ఆవశ్యకత సంరక్షణ లేక ఎదుగుదల కోసమే.
29. మనిషి అవసరాలు అతని యొక్క సమస్యలు, ఎందుకంటే అవి విజయాన్ని ఆనందించేదుకు అత్యావశ్యకం గనుక.
మనస్పూర్తిగా పనిచేయని వారు జీవితంలో విజయాన్ని సాధించలేరు.
30. విజ్ఞానం పునాది లేని ఇంటిని సైతం నిలబెడుతుంది. కాని అజ్ఞానం ఎంతో దృఢంగా కట్టిన ఇంటిని కూడా పడగొడుతుంది.
31. నువ్వెప్పుడూ జ్ఞానమనే సముద్రంలో ముత్యంలా మెరవాలి.
32. పతి ఒక్కరూ అందంగానే పుడతారు. కాని కొందరు తమను వికృతంగా మార్చే అవకాశాన్ని ప్రపంచానికి ఇస్తూ ఉంటారు.
33. మీరు దేనినైనా కోరుకుంటే దాన్ని పొందేవరకు మీ ప్రయత్నాన్ని ఆపవద్దు. ఎదురుచూడటం కష్టంగానే ఉంటుంది. కాని దాన్ని పొందలేక పోయినప్పుడు కలిగే బాధను భరించటం మరింత కష్టంగా ఉంటుంది.
34. బాధ కలిగినప్పుడు కన్నీటిని వదిలే బదులు ఆ కన్నీటికి కారణమైనవారిని వదిలేయటం ఉత్తమం.
35. మీ అపజయాల్ని తప్పటడుగులని ఎప్పుడూ అనుకోకండి. అవి తప్పులు కావు. భవిష్యత్తులో మీరేం చేయకూడదో తెలిపే పాఠాలు.
36. మంచి ఉద్దేశాలు కలవారు ప్రమాణాలు చేస్తారు. మంచి వ్యక్తిత్వం కలవారు మాత్రమే వాటిని నిలబెట్టుకుంటారు.